Moviesటాలీవుడ్‌లో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బొక్క బోర్లా ప‌డ్డ టాప్ -...

టాలీవుడ్‌లో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బొక్క బోర్లా ప‌డ్డ టాప్ – 5 సీక్వెల్స్ ఇవే…!

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సీక్వెల్స్ జోరు న‌డుస్తోంది. ఈ జోరు మామూలుగా లేదు. ఒక సినిమా హిట్ అయితే చాలు. ఆ సినిమాకు సీక్వెల్స్ చేసుకుంటూ వ‌స్తున్నారు. బాలీవుడ్ కంటే తెలుగులోనే ఎక్కువుగా ఈ సీక్వెల్స్ హంగామా న‌డుస్తోంది. అయితే ఎందుకో గాని సీక్వెల్స్ స‌క్సెస్ రేటు చాలా త‌క్కువుగా ఉంటోంది. ఏదో బాహుబ‌లి ది కంక్లూజ‌న్ లాంటి సినిమాలు మిన‌హాయిస్తే సీక్వెల్స్‌కు స‌క్సెస్ రేటు పెద్ద‌గా ఉండ‌డం లేదు. మ‌న తెలుగులో ఎప్పుడో సీక్వెల్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బొక్క బోర్లా ప‌డ్డ 5 టాప్ సీక్వెల్స్ సినిమాల గురించి మ‌నం తెలుసుకుందాం.

 

1- శంక‌ర్‌దాదా జిందాబాద్ :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. 2005లో వ‌చ్చిన ఈ సినిమాకు జ‌యంత్ ద‌ర్శ‌కుడు. సోనాలి బింద్రే హీరోయిన్. బాలీవుడ్‌లో వ‌చ్చిన ల‌గేర‌హే మున్నాబాయ్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ హైలెట్‌. త‌ర్వాత ఇదే సినిమాకు సీక్వెల్‌గా శంక‌ర్‌దాదా జిందాబాద్ భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చింది. చిరు కెరీర్‌లోనే ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 2007లో వ‌చ్చిన ఈ సినిమా త‌ర్వాత చిరు ప‌దేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మై రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయాడు.

2- ఆర్య 2 :
అల్లు అర్జున్ కెరీర్‌లో రెండో సినిమాగా ఆర్య వ‌చ్చింది. సుకుమార్‌కు ఇది డెబ్యూ మూవీ. డిఫ‌రెంట్ ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఆర్య సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బ‌న్నీకి యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా 2010లో ఆర్య 2 వ‌చ్చింది. కాజ‌ల్ హీరోయిన్గా వ‌చ్చిన ఈ సినిమాకు కూడా సుకుమారే ద‌ర్శ‌కుడు. ఆర్య రేంజ్‌లో ఆర్య 2 హిట్ అవ్వ‌లేదు.

3- కిక్ 2 :
ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. కానీ ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన కిక్-2 మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. కిక్ 2 దెబ్బ‌తో నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఆర్థికంగా బాగా న‌ష్ట‌పోయారు.

4- పోలీస్‌స్టోరీ 2 :
తెలుగులో వ‌చ్చిన కాప్ స్టోరీతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది పోలీస్ స్టోరీ. సాయికుమార్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోయి మ‌రీ చూస్తూ ఉంటారు. అప్ప‌ట్లో సౌత్ ఇండియాను ఈ సినిమా ఊపేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన పోలీస్‌స్టోరీ 2 ప్లాప్ అయ్యింది.

5 – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ :
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌దేళ్ల త‌ర్వాత గ‌బ్బ‌ర్‌సింగ్ రూపంలో హిట్ వ‌చ్చింది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. బాలీవుడ్‌లో వ‌చ్చిన స‌ల్మాన్‌ఖాన్ ద‌బాంగ్‌కు రీమేక్‌గా ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news