Moviesఒక్క దెబ్బ తో మళ్లీ ట్రెండింగ్ లోకి రాజమౌళి..హ్యాట్సాఫ్ సారూ..!

ఒక్క దెబ్బ తో మళ్లీ ట్రెండింగ్ లోకి రాజమౌళి..హ్యాట్సాఫ్ సారూ..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపజయం ఎరుగని డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేనా..మన తెలుగు సినిమాలని ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేశాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇందస్ట్రీ లెక్కలు మార్చేశాడు జక్కన్న. ఎప్పుడూ చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలకు రూపమిస్తూ దూసుకుపోయే ఆయన రీసెంట్ గా RRR తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.


టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్‌చ‌ర‌ణ్ అగ్గిపిడుగు అల్లూరిగా గ‌ర్జిస్తే.. ఎన్టీఆర్ గోండు బెబ్బులి గా విజృంభించాడు. ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాని నమోదు చేఇసంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా తో రాజమౌలి మరోసారి తన మార్క్ తో అభిమానులను అలరించాదు. అయితే, ఈ సినిమాని మళ్లి ధియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

 

యస్..RRR సినిమాను అమెరికాలో మళ్ళీ ధియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. జూన్‌ 1న అమెరికాలోని వంద థియేటర్లలో మళ్లీ రిలీజ్‌ అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. సినిమా రిలీజ్‌ టైంలో మూవీ నిడివిని తగ్గించేందుకు చిత్రం బృందం కొన్ని సన్నివేశాలను కట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తారక్ చరణ్ ల కు సంబంధించి బ్యూటీఫుల్ సీన్స్ మిస్ అయ్యాయి. అయితే తాజాగా తొలగించిన సన్నివేశాలను అలాగే ఉంచి మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తున్నారు. దీంతో డైరక్టర్ రాజమౌళి గురించి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యుఎస్ రివ్యూవర్స్, అక్కడ సినీ అభిమానులు రాజమౌళి గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news