Moviesపుష్ప 2 లో అలాంటి సీన్స్..సుకుమార్ మహా చిలిపి..?

పుష్ప 2 లో అలాంటి సీన్స్..సుకుమార్ మహా చిలిపి..?

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ఈ “పుష్ప”. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ మాస్ హీరో గా ఈరగదీశాడు. రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు యావరేజ్ టాక్ వినిపించిన ఆ తరువాత రికాడ్లు బద్ధలు కొడుతూ దూసుకుపోయింది.

అల్లు అర్జున్ హీరోగా నతీంచిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించింది. ఫుల్ డీ గ్లామరస్ లుక్ లో తనలో కొత్త టాలెంట్ ను బయట పెట్టింది. ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదట పార్ట్ లో ది రైజ్ అంటూ పుష్ప ఎలా ఎదిగాడో చూయించిన సుకుమార్..రెండో పార్ట్ లో ది రూల్ అంటూ టైటిల్ రివీల్ చేశాడు.

అయితే, పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ మారుతున్న ఇండస్ట్రీ లెక్కలకు అనుగుణంగా అతన కధలో కూడా పార్పులు చేస్తున్నాడట సుకుమార్. పార్ట్ 1 లో ఉంచిన క్యారెక్టర్లను కొందరిని తీసేసి..కొత్త ముఖాలు కనపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 లో మరో కత్తిలాంటి హీరోయిన్ ను దింపుతున్నారట సుకుమార్. పార్ట్ 1 లో పుష్ప-శ్రీవల్లికి పెళ్లి అవుతుంది. ఇక అక్కడి నుండి పార్ట్ 2 కధ మనకు కనిపిస్తుంది. కాగా, పెళ్లి తరువాత భార్య భర్తల మధ్య వచ్చే కొన్ని చిలిపి సన్నివేశాలను పార్ట్ లో మన కళ్ళకు కట్టిన్నట్లు చూయించబోతున్నారట సుకుమార్.

 

ఈ పాత్రల్లో పుష్ప-శ్రీవల్లిని ఊహించుకుంటేనే సూపర్ గా అనిపిస్తుంది అంటున్నారు అభిమానులు. అయితే, పెళ్లి తరువాత శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవ్వడం.. మళ్లీ వాళ్ళ నాన్న పుట్టబోతున్నాడు అని ఫ్యామిలీ అంతా సంతోషిస్తున్న టైంలో సీన్ లోకి ఎంటర్ అయిన మంగళం శీను భార్య..దాక్షాయని..తన తమ్ముడిని చంపిన పగతో శ్రీవల్లిని, ఆమె కడుపులోని బిడ్డని నరికి చంపేస్తుందని.. దాంతో పుష్ప క్రూరంగా మారిపోతాడని..మంచి-చెడు లెక్క చేయకుండా..రాక్షసుడిలా మారిపోతాడట.

ఇక ఆ టైంలో నే కధలోకి కొత్త హీరోయిన్ ఎంట్రీ ఉంటుందట. అందుకోసం బాలీవుడ్ నుండి ఓ సూపర్ హాట్ ఐటెం ని రంగంలోకి దించుతున్నారట సుకుమార్. జూన్ మొదటి వారంలో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని..అప్పుడు సినిమా సెకండ్ హీరోయిన్ ని అధికారికంగా రివీల్ చేస్తారట పుష్ప 2 టీం. మరి ఆ కత్తి లాంటి ఫిర్ ఎవ్వరు తెలియాలి అంటే కొన్ని రోఝులు ఆగాల్సిందే..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news