Moviesబ్లాక్‌బ‌స్ట‌ర్ న్యూస్‌... ఎన్టీఆర్‌కు జోడీగా దీపికా ప‌దుకొణె... !

బ్లాక్‌బ‌స్ట‌ర్ న్యూస్‌… ఎన్టీఆర్‌కు జోడీగా దీపికా ప‌దుకొణె… !

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఇప్పుడు మామూలు ఫామ్‌లో లేడు. త్రిబుల్ ఆర్ సినిమాతో త‌న కెరీర్‌లో డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. టెంప‌ర్‌తో స్టార్ట్ అయిన ఎన్టీఆర్ విజ‌యాల ప‌రంప‌ర తాజాగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్ వ‌ర‌కు బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడున్న జ‌న‌రేష‌న్ హీరోల్లో ఏడేళ్ల పాటు ఒక్క ప్లాప్ లేకుండా ఆరు వ‌రుస హిట్లు అంటే మామూలు విష‌యం కాదు. పైగా కంటెంట్ ప‌రంగా వీక్‌గా ఉన్న సినిమాల‌ను కూడా ఎన్టీఆర్‌కేవ‌లం త‌న ఛ‌రిష్మా, న‌ట‌న‌తో హిట్ చేసుకుంటూ వ‌చ్చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. పైగా ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ క్రేజ్‌మామూలుగా లేదు.

ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌.. ఎన్టీఆర్ సినిమాయే ప‌ట్టాలు ఎక్క‌నుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో నీల్ సినిమా 31వ సినిమాగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర ఉండ‌బోతోంద‌ట‌. ఆ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. ఈ పాత్ర చేసేందుకు లోక‌నాయ‌కుడు అయిన క‌మ‌ల్‌హాస‌న్‌ను ద‌ర్శ‌కుడు నీల్ ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో చేస్తోన్న దీపికా ప‌దుకొణేను ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆమెతో ఇప్ప‌టికే ప్రాథ‌మిక చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయంటున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా దీపికా అంటే ఏ రేంజ్‌లో పాన్ ఇండియా లెవ‌ల్లో అంచ‌నాలు ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ అక్టోబ‌ర్ నుంచి ప్లాన్ చేసేలా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.

సేమ్ కేజీయ‌ఫ్‌, స‌లార్ సినిమాల‌కు ప‌ని చేస్తోన్న టీంతోనే ద‌ర్శ‌కుడు నీల్ ఎన్టీఆర్ సినిమా తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు ప్రశాంత్ నీల్ టేకింగ్‌, వండ‌ర్ ఫుల్ విజువ‌ల్స్ తోడైతే ఇక పాన్ ఇండియా లెవ‌ల్లో ర‌చ్చ రంబోలాయే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news