Moviesయంగ్ హీరోల భజన చేస్తున్న గీతా ఆర్ట్స్..అరవింద్ విన్ అయ్యేనా..?

యంగ్ హీరోల భజన చేస్తున్న గీతా ఆర్ట్స్..అరవింద్ విన్ అయ్యేనా..?

గీతా ఆర్ట్స్ అధినేత , నిర్మాతగా ఉన్న‌ అల్లు అరవింద్ కు ఉన్న తెలివితేటలు గురించి ఎంత చెప్పినా తక్కువే. డిఫరెంట్ స్టైల్ లో ఉన్న story చూస్ చేసుకుని..ఓ విజన్ తో సినిమాలని ప్రోడ్యూస్ చేస్తాడు. కొడుకుల కెరీర్ లను బాగా సెట్  చేసిన అరవింద్.. మెగా కాంపౌండ్ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషించారు అందరికి తెలిసిందే.

అలాగే చిరంజీవి కెరీర్ కు కూడా అరవింద్ ప్లానింగ్ చాలా ప్లస్ అయ్యిందని అంటారు సినీ విశ్లేషకులు. ఎవ్వరు ఊహించని విధంగా మొన్నటికి మొన్న ఆహా ఓటిటి ని తెలుగులో నెంబర్ వన్ స్దాయికి తీసుకెళ్ళారు అంటే అది మామూలు విషయం కాదు. కొడుకుల సినిమాలు ఏమో కానీ నిర్మాణంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఆయన దూసుకు పోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ అల్లు అరవింద్ స్టైల్ మార్చారు. బడా హీరోలతో కాకుండా చిన్న హీరోలతో సినిమాలు నిర్మించి భారీ మొత్తంలో లాభాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా వరుణ్ గని, హిందీ జెర్సీ..అరవింద్ కు బాగా బొక్క పెట్టేశాయి. వీటి..వడ్డీతో సహా లాభాలు తెచ్చుకునేందుకు పక్క ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాదూ అంటూ సినీ వర్గాలు అంటున్నాయి.

DJ టిల్లు తో మైండ్ బ్లాకింగ్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ తో ఓ సినిమాకి సైన్ చేయించుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సిద్ధు తో ఓ మాస్ ఎంటర్ టైనర్ స్టోరీని ఫిక్స్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో ని లైన్ లో పెట్టాడు అరవింద్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన అశోక వనంలో అర్జున కళ్యాణం హీరో విశ్వక్ సేన్ తో ఓ భారీ డీల్ ని సెట్ చేసుకున్నారట అరవింద్.

సినిమా టాక్ గురించి తెలుసుకున్న నిర్మాత అరవింద్.. విశ్వ‌క్ సేన్ కోసం గుట్టుచప్పుడు కాకుండా తన ఫార్మ్ హౌస్ లో ఓ ప్రవేట్ పార్టీ ఇచ్చారని..మీడియా కంట పడకుండా..మ్యాటర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ యువ హీరో త్వరలో G2 ద్వారా గీతా ఆర్ట్స్ కోసం సంతకం చేయనున్నాడని సినీ ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా హల్ చల్ చేస్తుంది. ఇలా యంగ్ హీరోలందరికీ గీతా కాంపౌండ్‌లో ఒక్కో సినిమా ఉండేలా అరవింద్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ సినిమాలో ఒక్కటి క్లిక్ అయినా ప్రొడక్షన్ హౌస్ కు ప్లస్ అవుతుంది.., ఆ హీరోల కెరీర్ కు మరింత ప్లస్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news