Moviesస్టార్ హీరో ఉపేంద్ర.. ఆ హీరోయిన్‌ని అంత పిచ్చిగా ప్రేమించాడా..?

స్టార్ హీరో ఉపేంద్ర.. ఆ హీరోయిన్‌ని అంత పిచ్చిగా ప్రేమించాడా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది సినీ నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం.. ఆ తర్వాత కొన్నాళ్ళపాటు ప్రేమలో మునిగి తేలి చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఆ తర్వాత ఎక్కడో తేడా కొట్టేసి చివరికి బ్రేకప్ చెప్పుకోవడం.. బ్రేకప్ చెప్పాక ఇక ఇద్దరు కూడా వేరు వేరు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఇలా జరిగిన పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. ఇక ఇలా ఒక హీరోతో కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత ఆ హీరోతో అభిప్రాయ భేదాలు రావడంతో చెప్పేసి వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్టులో అటు అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమ కూడా ఉన్నారు.

ఇక హీరోయిన్ ప్రేమ లవ్ స్టోరీ విషయం గురించి మాట్లాడుకునే ముందు.. ఇక ఈ స్టార్ హీరోయిన్ గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా.. తెలుగు – తమిళ – కన్నడ – మలయాళం అనే తేడా లేదు. అన్ని భాషల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ప్రేమ. అందం.. అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా ఎంతో మంది మనసులు కొల్లగొట్టింది. ముఖ్యంగా దేవి సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించింది ప్రేమ. ఇక ఆ తర్వాత ప్రేమ స్టార్ హీరోల ప‌క్క‌న‌ హీరోయిన్ గా కూడా నటించింది. ఈ ముద్దుగుమ్మ 2006లో వ్యాపారవేత్త జీవన్ ఆపచ్చుని పెళ్లి చేసుకుంది.

1996 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన‌ ధర్మచక్రం సినిమాతో వెంకటేష్ తో జోడీ కట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేమ‌. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఈ అమ్మడి మనసులో ప్రేమ పుట్టింది. క‌న్న‌డ‌ స్టార్ హీరోగా ఉన్న ఉపేంద్రతో ప్రేమలో పడింది. ఇక ఒకరినొకరు అమర ప్రేమికుల లాగా పిచ్చిగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నంతగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతేకాదు ఇక తన సినిమాల్లో ప్రేమను హీరోయిన్‌గా పెట్టుకోవాలని దర్శక, నిర్మాతలకు సలహాలు కూడా ఇచ్చాడు ఉపేంద్ర. ప్రేమ హీరోయిన్ గా ఉంది అంటే కాస్త రెమ్యూనరేషన్ కూడా తగ్గించాడట.

అంతలా ప్రేమను పిచ్చిగా ప్రేమించాడు ఉపేంద్ర. కానీ ఆ తర్వాత ఏమైంది వీరిద్దరికీ బ్రేకప్ అయింది. అయితే హీరోయిన్ ప్రేమ కారణంగానే వీరిద్ద‌రికి బ్రేకప్ అయింది అంటు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ప్రేమ త‌న‌ను కావాల‌నే దూరం పెట్టింద‌ని ఉపేంద్ర మ‌నోవేద‌న‌కు కూడా గుర‌య్యాడు. ఆ త‌ర్వాత ఉపేంద్ర… ప్రియాంక ( తెలుగులో జేడీ చ‌క్ర‌వ‌ర్తి సూరి ఫేం) అనే మరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రేమ వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును పెళ్లి చేసుకోగా 2016 లో ఆమెకు విడాకులు అయ్యాయి. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది హీరోయిన్ ప్రేమ. క‌ర్నాట‌క‌లోకి కొడుగు కాఫీ ఎస్టేట్‌ల‌తో పాటు బెంగ‌ళూరులో ఉంటూ ఆమె కాలం వెళ్ల‌దీస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news