Moviesఆ విషయంలో సమంత ఫెయిల్.. చేసిన త్యాగం వృధా అయిందా..?

ఆ విషయంలో సమంత ఫెయిల్.. చేసిన త్యాగం వృధా అయిందా..?

యస్..ప్రజెంట్ నెట్టింట ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంత వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా..”కాదువాకల రెండు కాదల్”. సినిమా నేదూ ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ.. సినిమా నవ్వుకోవడానికి బాగుంటుంది అని అంటున్నారు జనాలు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నే అయినా.. మనకు ఇది వరకు చూసిన పాత కధనే అయినా.. డైరెక్టర్ తెరకెక్కించిన తీరు అందరిని ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్స్ కేక అంటూ జనాలు పాజిటీవ్ రివ్యూ ఇస్తున్నారు.

కాగా, నేదు స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. భర్త తో విడాకులు తీసుకున్న తరువాత వచ్చిన ఫస్ట్ బర్త డే ని..సమంత తన ఫ్రెండ్స్ తో చిల్ ఓఉట్ అవుతూ సెలబ్రేట్ చేసుకుంది. అయితే, సామ్ పుట్టిన రోఝు సంధర్భంగా..ఈరోజు ఆమె నటించిన ఫస్ట్ పిరియాదిల్ మూవీ శాకుంతలం సినిమా స్పెషల్‌ పోస్టర్‌ ని రిలీజ్ చేశారు శాకుంతలం చిత్రయూనిట్‌. నిజానికి ఈ సినిమా పైనే సమంత అన్ని ఆశలు పెట్టుకుని ఉంది. సినిమా కోసం బాగా కష్టపడింది కూడా. ఇన్ని సంవత్సరాలు ఎన్నో పాత్రల్లో నతించిన..తన కెరీర్ లో శాకుంతలం సినిమా ది బెస్ట్ గా ఉంటుంది అని గర్వంగా చెప్పుకొచ్చింది.

శాకుంతలం మైథలాజికల్‌ ఫిల్మ్‌ కావడంతో శకుంతల పాత్ర డైలాగ్స్‌ గ్రాంథికంలో ఉంటాయి. అందుకని దాదాపు మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్‌ పూర్తి చేసిందట సామ్‌.దీంతో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్ట్ బట్టి చూస్తే.. సినిమాకి అంత సీన్ లేదంటున్నారు జనాలు. గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్ ని చూసిన నెటిజన్స్..సమంత రేంజ్ సినిమా కాదేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం అన్నీ ఆశలు ఈ సినిమా పై పెట్టుకుని చాలా సినిమాలను వదులుకున్న సమంత త్యాగం వృదా అవుతుందేమో అంటూ ఫ్యాన్స్ సైతం ఆలోచిస్తున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటూందో చూడాలి..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news