Moviesల‌గ్జ‌రీ కారు కొన్న రాజ‌మౌళి... రేటు చూస్తే క‌ళ్లు జిగేల్‌...!

ల‌గ్జ‌రీ కారు కొన్న రాజ‌మౌళి… రేటు చూస్తే క‌ళ్లు జిగేల్‌…!

దర్శకధీరుడు రాజమౌళి మూడేళ్ల పాటు ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎట్ట‌కేల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి సినిమా వ‌స్తుందంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో.. ఆ అంచ‌నాల‌కు త్రిబుల్ ఆర్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. వ‌సూళ్ల ప‌రంగా ఎలా ఉన్నా మ‌రోసారి రాజమౌళి నేష‌న‌ల రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ తీసి త‌న‌కు తానే సాటి అని ఫ్రూవ్ చేసుకున్నాడు.

ఇద్ద‌రు టాలీవుడ్ యంగ్ క్రేజీ స్ట‌ర్స్ కాంబినేష‌న్లో.. ఇద్ద‌రి ఇమేజ్‌లు బ్యాలెన్స్ చేస్తూ త్రిబుల్ ఆర్ సినిమా తీయ‌డం ఎంత పెద్ద ద‌ర్శ‌కుడికి అయినా క‌త్తిమీద సామే. అయినా రాజ‌మౌళి ఎన్టీఆర్ – చెర్రీ క్యారెక్ట‌ర్ల‌ను చ‌క్క‌గా బ్యాల‌న్స్ చేశాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి ఎవ్వ‌రూ అందుకోలేనంత‌గా మ‌రింత ఎత్తుకు ఎదిగాడు. ఇక ఈ సినిమాకు రాజ‌మౌళికి ఫ్యామిలీ ప్యాక్ రెమ్యున‌రేష‌న్‌తో పాటు లాభాల్లో 30 శాతం వాటా కూడా నిర్మాత దాన‌య్య ఇచ్చార‌న్న టాక్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇదిలా ఉంటే రాజ‌మౌళి త్రిబుల్ ఆర్ భారీ రెమ్యున‌రేష‌న్ జోష్‌లో ఉన్నార‌నుకుంటా.. ఆయ‌న కొత్త కారు కొనుగోలు చేశారు. రాజ‌మౌళి తాజాగా వోల్వో ఎక్స్‌సి40 కారు కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ కంపెనీ ఇండియా ప్ర‌తినిధి రాజ‌మౌళికి కారు తాళాల‌ను అందిస్తోన్న ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోల‌ను వోల్వో కార్స్ ఇండియా వాళ్లు త‌మ ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్‌లో షేర్ చేశారు.

రాజ‌మౌళి కొన్న ఈ కారు ఫ్యూజ‌న్ రెడ్ క‌ల‌ర్‌లో ఉంది. ఈ కారు రేటు సుమారు రు 44.50 ల‌క్ష‌లు అని తెలుస్తోంది. ఇందులో ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, వైర్‌లెస్ ఛార్జింగ్‌, డ్యూయ‌ల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫ్యూచ‌ర్స్ అన్ని ఉన్నాయి. ఏదేమైనా రాజ‌మౌళి ఇన్ని ల‌క్ష‌లు పెట్టి కొత్త కారు కొన్న విష‌యం ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్గా మారింది.

త్రిబుల్ ఆర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న రాజ‌మౌళి.. నెక్ట్స్ మ‌హేష్‌బాబుతో సినిమా చేస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తారు. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో తెర‌కెక్కే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ద‌స‌రా నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Volvo Car India (@volvocarsin)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news