Moviesనాగార్జున డిజాస్ట‌ర్ టైటిల్‌తో ర‌జ‌నీకాంత్ సినిమా...!

నాగార్జున డిజాస్ట‌ర్ టైటిల్‌తో ర‌జ‌నీకాంత్ సినిమా…!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారే కాని.. ఆయ‌న రేంజ్‌కు త‌గిన హిట్ అయితే ప‌డ‌డం లేదు. అప్పుడెప్పుడో వ‌చ్చిన రోబో త‌ర్వాత ర‌జ‌నీ రేంజ్‌లో హిట్ లేదు. వ‌రుస‌గా లింగా, 2.0, క‌బాలీ, కాలా, పేట‌, ద‌ర్బార్, పెద్ద‌న్న ఇలా వ‌రుస‌గా ర‌జ‌నీ సినిమాలు వ‌స్తున్నాయి.. ఆయ‌న ఫ్యాన్స్ ను డిజ‌ప్పాయింట్ చేసుకుంటూ పోతున్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే ర‌జ‌నీ మ‌రో సినిమాకు రెడీ అవుతున్నారు. ర‌జ‌నీకాంత్‌తో డాక్ట‌ర్ వ‌రుణ్‌, బీస్ట్ సినిమాల ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ఓ సినిమా చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే.

 

ప్ర‌స్తుతం నెల్స‌న్ కోలీవుడ్ క్రేజీ స్టార్ విజ‌య్‌తో బీస్ట్ సినిమా తెర‌కెక్కించాడు. స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోంది. హిందీలో ఈ సినిమా రా పేరుతో రిలీజ్ అవుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 13న ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత నెల్స‌న్ ర‌జ‌నీతో సినిమా చేస్తున్నాడు. వ‌రుస‌గా ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల‌తో సినిమాలు చేస్తుండ‌డంతో నెల్సన్ పేరు మార్మోగుతోంది.

అయితే ఈ సినిమాకు తెలుగులో నాగార్జున హీరోగా వ‌చ్చిన ఓ డిజాస్ట‌ర్ సినిమా టైటిలే వాడుతున్నార‌ని టాక్ ? నాగార్జున – లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార జంట‌గా బాస్ పేరుతో ఓ సినిమా వ‌చ్చింది. 2006లో వ‌చ్చిన ఈ సినిమాలో పూన‌మ్ బ‌జ్వా మ‌రో హీరోయిన్. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ఇదే బాస్ టైటిల్‌తో ర‌జ‌నీకాంత్ – దిలీప్‌కుమార్ సినిమా రాబోతోంది. ఆగ‌స్టు నుంచి ఈ సినిమాను ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

కంటిన్యూగా షూటింగ్ జ‌రిపి 2023 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా ప్లానింగ్ చేస్తున్నారు. ర‌జినీకాంత్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్యా రాయ్ న‌టించ‌నుంద‌ని.. తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా భామ ప్రియాంక అరుళ్ మోహ‌న్ సూప‌ర్‌స్టార్ కుమార్తె పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌జ‌నీ సినిమాలు అంటేనే పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటాయి. యూనివ‌ర్సీల్ అప్పీల్ ఉండేలాగానే ఈ సినిమాకు బాస్ టైటిల్ పెడుతున్నార‌ట‌. మ‌రి నాగ్ డిజాస్ట‌ర్ టైటిల్ ర‌జ‌నీకి ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news