Moviesప్రేమ‌కు వ‌య‌స్సుతో ప‌నేంటంటోన్న సినిమా స్టార్లు.. చిన్నోళ్ల‌తోనే పెళ్లిళ్లు..!

ప్రేమ‌కు వ‌య‌స్సుతో ప‌నేంటంటోన్న సినిమా స్టార్లు.. చిన్నోళ్ల‌తోనే పెళ్లిళ్లు..!

ప్రేమ గుడ్డిది అంటారు.. అంటే ఎవ‌రు ఎవ‌రిని ఎందుకు ? ప్రేమిస్తారో తెలియ‌దు. ఒక‌రి కంటికి ఏ మాత్రం న‌చ్చ‌ని వాళ్లు.. మ‌రొక‌రికి పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేస్తారు. ఇక ఇటీవ‌ల ట్రెండ్ మారింది. ఒక‌ప్పుడు పెళ్లిళ్లు, ప్రేమ‌ల‌కు అమ్మాయి వ‌య‌స్సు కంటే అబ్బాయి వ‌య‌స్సు పెద్ద‌గా ఉండాల‌న్న నిబంధ‌న ఉండేది. అయితే ఇప్పుడు సినిమా సెల‌బ్రిటీలు అస‌లు దీని గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌న‌సులు క‌లిశాయా ? లేదా ? అన్న‌ది మాత్ర‌మే చూస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం త‌మ కంటే వ‌య‌స్సులో చిన్న అబ్బాయిల‌తో ప్రేమ‌లో ప‌డుతున్నారు.. పెళ్లి చేసుకుని ఎంచ‌క్కా కాపురం చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా త‌న‌కంటే 11 ఏళ్లు చిన్నోడు అయిన నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు ప్రేమ వివాహం చేసుకున్న‌ప్పుడు నిక్ కేవ‌లం.. ప్రియాంక ఆస్తికోస‌మే పెళ్లి చేసుకున్నాడ‌ని.. ప్రియాంక నిక్ జీవితాన్ని బ‌లి చేసింద‌ని విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఇప్పుడు ఈ జంట ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక బాలీవుడ్‌లోనే కొన్నాళ్ల పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందిన అనుష్క శ‌ర్మ త‌న‌కంటే వ‌య‌స్సులో ఆరు నెల‌ల చిన్నోడు అయిన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ క‌మర్షియ‌ల్ యాడ్‌లో వీరు క‌లిసి న‌టించిన‌ప్పుడు ఏర్ప‌డిన ప‌రిచయం కాస్తా ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఇప్పుడు ఈ జంట‌కు పిల్ల కూడా ఉంది.

ఇక మాజీ మిస్ ఇండియా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సైతం త‌న కంటే వ‌య‌స్సులో చిన్నోడు అయిన టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబును ప్రేమ వివాహం చేసుకుంది. వ‌య‌స్సులో మ‌హేష్ కంటే న‌మ్ర‌త రెండేళ్లు పెద్ద‌. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ రాయ్ కంటే రెండేళ్లు చిన్నోడు. అభిషేక్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఫైట్ చేసి మ‌రీ ఐశ్వ‌ర్య‌ను పెళ్లాడాడు.ఈ జంట‌కు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది.

ఇక ఒక్క సినిమాలో కూడా క‌లిసి న‌టించ‌క‌పోయినా నిజ జీవితంలో దంప‌తులు అయ్యారు సైఫ్ ఆలీఖాన్ – అమృతాసింగ్‌. వ‌య‌స్సులో సైఫ్ కంటే అమృత ఏకంగా 13 ఏళ్లు పెద్ద‌ది. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక వీరు విడిపోయారు. ఆ త‌ర్వాత సైఫ్ వ‌య‌స్సులో త‌న కంటే 15 ఏళ్లు చిన్న అయిన క‌రీనా క‌పూర్‌ను పెళ్లాడారు.
మ‌రో బాలీవుడ్ మాజీ హీరోయిన్ బిపాసా బసు తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడితే.. మ‌రో బీ టౌన్ సీనియ‌ర్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా త‌న కంటే మూడేళ్లు చిన్నోడు అయిన రాజ్ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకుంది.

అంతెందుకు బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు మలైకా అరోరా – అర్జున్ క‌పూర్ మ‌ధ్య ఏకంగా 15 ఏళ్ల వ‌య‌స్సు అంత‌రం ఉంది. మ‌లైకా వ‌య‌స్సులో అర్జున్ క‌పూర్ కంటే 15 ఏళ్ల పెద్ద‌. అయినా వీరు స‌హ‌జీవ‌నంలో మునిగి తేలుతున్నారు. మ‌రో మాజీ ప్ర‌పంచ సుంద‌రి సుస్మితా సేన్ సైతం వ‌య‌స్సులో త‌న‌కంటే 15 ఏళ్లు చిన్నోడు అయిన రోహ్మ‌న్ పాల్‌తో కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. తాజాగా విడిపోయింది.

ఇక నేహా ధూపియా – అంగ‌ద్ భేటీ జంట కూడా హాట్ టాపికే. నేహా కంటే అంగ‌ద్ వ‌య‌స్సులో రెండేళ్లు చిన్న‌. అంతెందుకు తాజాగా ర‌ణ‌బీర్ క‌పూర్ .. త‌న‌కంటే వ‌య‌స్సులో 10 ఏళ్లు చిన్న‌ది అయిన ఆలియా భ‌ట్‌ను త్వ‌ర‌లోనే పెళ్లాడుతున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ప‌దేళ్ల గ్యాప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా మన సినిమా సెల‌బ్రిటీల‌కు వ‌య‌స్సుతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రేమ‌లు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news