Moviesవావ్: బంఫర్ ఆఫర్ అందుకున్నKGF 2 రమికా సేన్..ఏకంగా ఆ బడా...

వావ్: బంఫర్ ఆఫర్ అందుకున్నKGF 2 రమికా సేన్..ఏకంగా ఆ బడా హీరోతో ?

రాక్‌స్టార్ యష్ నటించి..ఉర్రూతలూగించిన కేజీఎఫ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా వచ్చిందే KGF 2. బాక్స్ ఆఫిస్ వద్ద RRR రికార్డులను తిరగ రాస్తుంది ప్రశాంట్ నీల్ తెరకెక్కించిన KGF 2. కన్నడ స్టార్ హీరో యాష్ నటించిన ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చేసింది. ముందు నుండి భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా…సినిమా పై ఎక్కడో డౌట్ ఉండేది. కానీ, ఆ సందేహాలను తుడిపెట్టేశాడు ప్రశాంత్. సరికూత స్క్రీన్ ప్లేతో సెకండ్ కూడా బోర్ కొట్టకుండా.. చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. కానీ సినిమాలో హీరో తరువాత హీరో ల అనిపించిన పాత్ర రిమికా సేన్ ది. కేజీఎఫ్ ఛాప్టర్ 2లో రాజకీయ నాయకురాలిగా రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ కన్పించి..అందరిని అలరించింది. రవీనా ఇలాంటి పాత్రలో కనిపిస్తుందని.. ఇంత బాగా నటిస్తుందని ఎవ్వరు ఊహించలేకపోయారు. రాఖీ భాయ్ ని ధైర్యంగా ఎదురుకున్నే ప్రధాన మత్రి రిమికా పాత్రల్లో రవినా చాలా బాగా నటించింది. బడా బడా హీరోలు కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పాత్రలో ఆమె అగ్రెసివ్ నెస్, డిక్టేటర్ షిప్, పెర్పార్మెన్స్ మెప్పిస్తాయి. ఈ సినిమాతో రవీనాకి మంచి పేరు రావడంతో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో రవినా అద్దిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లక్కి డైరెక్టర్ హరీశ్ శంకర్ తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడని. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రంలో ఆమెకి స్పెషల్ రోల్ ఆఫర్ చేశాడట హరీశ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పాత్ర నచ్చడంతో రవీనా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. దీని పై పవన్ ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగా ఉన్నారు..అలాంటి పవర్ ఫుల్ ఉమెన్ పవన్ సినిమాలో నటిస్తే.. ఇంకా బాగా హిట్ అవుతుంది అంటున్నారు.మరి త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news