News' కేజీయ‌ఫ్ 2 ' ఫ‌స్ట్ డే వ‌సూళ్లు... య‌శ్‌, నీల్...

‘ కేజీయ‌ఫ్ 2 ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు… య‌శ్‌, నీల్ ఏంది ఈ అరాచ‌కం…!

మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2 ఎట్ట‌కేల‌కు నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1 ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో చాప్ట‌ర్ 2 మీద మూడేళ్ల నుంచి భారీ అంచనాలు నెల‌కొన‌డంతో పాటు ఈ మూడేళ్ల‌లో చాలా ప‌రిణామాలు జ‌రిగిపోయాయి. రాకింగ్ స్టార్ య‌శ్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు.

ఇటు ఈ సినిమా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అయిపోయాడు. పైగా ప్ర‌శాంత్‌తో సినిమాలు తీసేందుకు స్టార్ నిర్మాత‌ల‌తో పాటు ద‌ర్శ‌కులు కూడా క్యూలో ఉన్నారు. కేజీయ‌ఫ్ 2 రిలీజ్ కాకుండానే ప్ర‌శాంత్ నీల్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా తీసేస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా తీస్తున్నాడు.

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో కూడా సినిమా ఉంటుంద‌ని నీల్ చెప్పేశాడు. ఇక స్టార్ హీరోలు కూడా నీల్‌తో ఒక్క సినిమా చేస్తే బాగుంటుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు. ఇదిలా ఉంటే కేజీయ‌ఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక తొలి రోజు ఏపీ, తెలంగాణ‌లో రు. 20 కోట్ల షేర్ రాబట్టింది.

ఏరియాల వారీగా చూస్తే
నైజాం – 8.4 కోట్లు
సీడెడ్ – 2.80 కోట్లు
వైజాగ్ – 1.75 కోట్లు
ఈస్ట్ గోదావరి – 1.2 కోట్లు
వెస్ట్ గోదావరి – 85 లక్షలు
కృష్ణ – 91 లక్షలు
గుంటూరు – 1.5 కోట్లు
నెల్లూరు – 50 లక్షలు

ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఏపీ, తెలంగాణ నుంచే ఏకంగా రు. 20 కోట్ల షేర్ అంటూ మామూలు అరాచ‌కం కాదు. ఇది చాలా మంచి నెంబ‌ర్ అనే చెప్పాలి. అయితే ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువే జ‌ర‌గ‌డంతో టార్గెట్ కూడా ఎక్కువే. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో ఫ‌స్ట్ వీకెండ్ క‌లిసి రానుంది. ఆచార్య వ‌చ్చే వ‌ర‌కు పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో కేజీయ‌ఫ్ 2కు టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఎదురులేన‌ట్టే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news