Movies' ఎఫ్ 3 ' ప్రోమో వ‌చ్చేసింది.. చూసుకున్నోడికి చూసుకున్నంత అందాల...

‘ ఎఫ్ 3 ‘ ప్రోమో వ‌చ్చేసింది.. చూసుకున్నోడికి చూసుకున్నంత అందాల ఆర‌బోత (వీడియో)

టాలీవుడ్‌లో అఖండ‌తో స్టార్ట్ అయిన పెద్ద సినిమాల జాత‌ర కంటిన్యూ అవుతోంది. అఖండ – పుష్ప – బంగార్రాజు – రాధేశ్యామ్ – త్రిబుల్ ఆర్ .. ఈ నెల‌లో ఆచార్య‌.. వ‌చ్చే నెల‌లో స‌ర్కారు వారి పాట‌.. ఆ త‌ర్వాత ఎఫ్ 3. ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సీక్వెల్‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎఫ్ 2 2019 సంక్రాంతి కానుక‌గా బాల‌య్య క‌థానాయ‌కుడు, రామ్‌చ‌ర‌ణ్ విన‌య‌విధేయ రామ లాంటి పెద్ద సినిమాల‌కు పోటీగా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది.

ఎఫ్ 2 దిల్ రాజుకు భారీ లాభాల పంట పండించింది. ఇప్పుడు అదే ఇద్ద‌రు హీరోలు వెంకీ, వ‌రుణ్ తేజ్‌.. ఇద్ద‌రు సేమ్ హీరోయిన్లు త‌మ‌న్నా, మెహ్రీన్‌తోనే ఎఫ్ 3 తెర‌కెక్కించారు. కాక‌పోతే సునీల్ కొత్త‌గా యాడ్ అయ్యాడు. అటు పూజా హెగ్డే ఐటెం సాంగ్‌.. ఇవ‌న్నీ చూస్తుంటేనే ఎఫ్ 3 ఎంత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుందో తెలుస్తోంది. తాజాగా సినిమా ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కూడా తన మార్క్ స్టైల్లో ఇంట్ర‌స్టింగ్ బీట్‌లోనే ఉంది. ఇక మెయిన్ లీడ్ మ‌ధ్య రొమాన్స్ చూస్తుంటే మామూలుగా లేదు. ఎఫ్ 2 సినిమాలో అంత‌ర్లీనంగానే కావాల్సినంత రొమాన్స్‌తో పాటు బికినీ ట్రీట్‌లు, ఇద్ద‌రు హీరోయిన్ల అంద చందాలు చ‌క్క‌గా చూపించ‌డంలో అనిల్ ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.

ఇప్పుడు ఎఫ్ 3 విష‌యంలోనే అంత‌కు మించి రొమాన్స్‌.. ఇద్ద‌రు హీరోయిన్ల అందాలు చూపించ‌బోతోన్న‌ట్టు ప్రోమోలోనే చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఇద్ద‌రు హీరోయిన్ల నాభి అందాలు, న‌డుము అందాలు, మ‌ద్దులు, హ‌గ్గులు, అస‌లు చూసుకున్నోడికి చూసుకున్నంత అందం రా బాబు అన్న‌ట్టుగా ఈ సింగిల్ ప్రోమో ఉంది.

ఇటు దేవీ సాంగ్ మాంచి ప్రామీసింగ్‌గానే క‌నిపిస్తోంది. మ‌రి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 22 వ‌ర‌కు ఆగాలి. ఇక ఈ సినిమాను ముందు ఈ నెల‌లో రిలీజ్ చేయాల‌నుకున్నా ఆచార్య కార‌ణంగా మే 27కు వాయిదా వేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news