Moviesఈ ఫొటోలో ఉన్న స్టార్‌ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా...!

ఈ ఫొటోలో ఉన్న స్టార్‌ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ల‌కు లైఫ్ త‌క్కువుగా ఉంటుంది. ఎంత గొప్ప హీరోయిన్ అయినా ఇండ‌స్ట్రీలో మ‌హా అయితే ఓ ఐదారేళ్లు మాత్ర‌మే ఫుల్ ఫామ్‌లో ఉంటుంది. ఆ తర్వాత కుర్ర హీరోయిన్ల పోటీ ముందు త‌ట్టుకోలేక ఎవ‌రైనా రేసులో వెన‌క్కు త‌గ్గాల్సిందే. హీరోలు అయితే ఏకంగా ఏళ్ల‌కు ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీని ఏలేస్తూనే ఉంటారు. హీరోయిన్ల‌లో త్రిష‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా లాంటి కొంద‌రు మాత్ర‌మే ప‌దేళ్ల‌కు పైగా స్టార్ హీరోయిన్లుగానో లేదా ముదురు ముద్దుగుమ్మ‌ల్లాగానో కంటిన్యూ అవుతూ వ‌స్తుంటారు.

ఇక కొంద‌రు హీరోయిన్లు చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఆ సినిమాల ప్ర‌భావం వ‌ల్ల‌నో లేదా ఆ క్యారెక్ట‌ర్ వ‌ల్ల‌నో ప్రేక్ష‌కుల మైండ్‌లో బాగానే రిజిస్ట‌ర్ అయిపోతారు. బెంగాలీ అమ్మాయి రీచా గంగోపాధ్యాయ తెలుగు వాళ్ల‌కు బాగా తెలిసిన హీరోయినే. రానా ద‌గ్గుబాటి తొలి సినిమా లీడ‌ర్‌తో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమాతోనే న‌ట‌నా ప‌రంగా మంచి మార్కులు వేయించుకుంది.

ఆ త‌ర్వాత అనుకున్న రేంజ్‌లో అవ‌కాశాలు రాక‌పోయినా ర‌వితేజ మిర‌ప‌కాయ్ సినిమాలో చేసింది. ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. మిర‌ప‌కాయ్ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మిర్చి సినిమాలోనూ న‌టించింది. మిర్చి లాంటి హిట్‌.. ప్ర‌భాస్ ప‌క్క‌న చేసినా కూడా ఆమెకు ఎందుకు పెద్ద స్టార్ల సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ఆ త‌ర్వాత వెంకీ నాగ‌వ‌ల్లి, నాగార్జున భాయ్‌, ర‌వితేజ సారొచ్చారు సినిమాలు చేసింది.

ఆ త‌ర్వాత స‌డెన్‌గా సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది. హ‌య్య‌ర్ స్ట‌డీస్ కోసం అంటూ విదేశాల‌కు చెక్కేసింది. హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌స్తోన్న స‌మ‌యంలోనే ఆమె స‌డెన్‌గా సినిమాలు ఆపేసి చ‌దువు కుంటాన‌ని వెళ్ల‌డం ఏంటో ఎవ్వ‌రికి అర్థం కాలేదు. అక్క‌డ చ‌దువుకుంటోన్న టైంలోనే తన స్నేహితుడు జో లాంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గ‌తేడాదే ఆమె పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఇప్పుడు రీచా బిడ్డ‌కు లుకా షాన్ లాంగెల్లా అని పేరు పెట్టారు. ప్ర‌స్తుతం రీచా ఆ చిన్నారి ఆల‌నా పాల‌నా చూసుకుంటూ ఇంటికే ప‌రిమితం అయిపోయింది. తాజాగా త‌న బిడ్డ‌తో పాటు త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయడంతో అది బాగా వైర‌ల్ అవుతోంది. అస‌లు చాలా మంది ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఎలా ఉండే రీచా ఎలా మారిపోయింద‌ని చెవులు కొరుక్కుంటున్నారు. రీచా కాస్త బొద్దుగా మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news