Moviesనాభి అందాల‌తో చంపేస్తోన్న ముదురు ముద్దుగుమ్మ‌.. ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు...

నాభి అందాల‌తో చంపేస్తోన్న ముదురు ముద్దుగుమ్మ‌.. ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

ఇప్ప‌ట‌కీ 15 ఏళ్ల క్రితం.. అంత‌కు ముందు సోష‌ల్ మీడియాపై ఎవ్వ‌రికి పెద్ద అవ‌గాహ‌న లేదు. దీంతో సాధార‌ణ జ‌నాలు అస‌లు హైలెట్ అవ్వాలంటే వారి జీవితంలో ఏదో పెద్ద సంచ‌ల‌నం జ‌ర‌గాలి. ఆ మాట‌కు వ‌స్తే సెల‌బ్రిటీలు హైలెట్ అవ్వాల‌న్నా కూడా మీడియానే ప్ర‌ధాన ఆధారం. మీడియాలో వాళ్ల గురించి చిన్న వార్త వ‌స్తే చాలు.. అదే పెద్ద సంతోషం అన్న‌ట్టుగా ఉండేది.

అయితే ఇప్పుడు న‌డుస్తోందంతా సోష‌ల్ మీడియా యుగం. ఒక‌రి గురించి మ‌రొక‌రు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రికి వారు త‌మ సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో పోస్టులు పెట్టినా, ఫొటోలు పెట్టినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ యుగం కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ఈ సోష‌ల్ మీడియా దెబ్బ‌తో జ‌నాలు మ‌ర్చిపోయి ఫేడ‌వుట్ అయిపోయిన హీరోయిన్లు సైతం ఇంకా తాము లైన్లోనే ఉన్నామ‌ని చెప్పుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంది.

తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించిన ప్రముఖ వెటరన్ హీరోయిన్ శ్వేత మీనన్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్ర‌స్తుతం సినిమాకు శ్వేతామీన‌న్ దూరంగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో మాత్రం త‌న హాట్ హాట్ ఇమేజ్‌లు షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా శ్వేత త‌న ఇన్ స్టా అక్కౌంట్లో తాను హీరోయిన్‌గా న‌టిస్తోన్న స‌మ‌యంలో ఉన్న ఫొటోను షేర్ చేసింది.

ఈ ఫోటోలో శ్వేతా మీనన్ తన అందాలు ఆరబోస్తూ నాభి అందాలు చూపిస్తూ మ‌తులు పోగొట్టేస్తోంది. అస‌లు ఆమె ఎవ‌రో కూడా గుర్తు ప‌ట్ట‌లేనంత అందంగా క‌నిపిస్తోంది. ఈ ఫొటోపై మ‌రో వెట‌ర‌న్ హీరోయిన్ భూమిక చావ్లా కూడా స్పందించింది. ఊహ్ లలా అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌పై శ్వేత కూడా స్పందించింది. ఫ‌న్నీ ఎమెజీతో రిప్లై ఇచ్చింది.

శ్వేత మీన‌న్‌ను ఈ పాటికే మీరు గుర్తు పట్టారా ? ఆమె తెలుగులో అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చాలా బాగుంది లాంటి సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వేసిన రాంగ్ స్టెప్పుల‌తో హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. 40 ఏళ్ల వయసులో ఇటీవలే ఈ అమ్మడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news