Moviesతన నిజ జీవిత క‌థ‌లో న‌టిస్తోన్న అనుష్క‌... ఇదో సంచ‌ల‌న‌మేనా..!

తన నిజ జీవిత క‌థ‌లో న‌టిస్తోన్న అనుష్క‌… ఇదో సంచ‌ల‌న‌మేనా..!

అనుష్క అప్పుడెప్పుడో ఫ‌స్ట్ లాక్ డౌన్ టైంలో స్క్రీన్ మీద క‌నిపించింది. ఆమె న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అంత‌కు ముందే చూస్తే ఆమె ఏ సినిమాలో న‌టించిందో ఎవ్వ‌రికి గుర్తు లేదు. దాదాపు 15 ఏళ్లుగా తెలుగు సినిమాను కాదు సౌత్ సినిమాను ఏలేసిన అనుష్క బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా ద్వారా మాత్ర‌మే మ‌న ప్రేక్ష‌కుల‌కు బాగా గుర్తుంది. ఆ సినిమా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక నిశ్శ‌బ్దాన్ని చాలా మంది గుర్తుంచు కోలేదు.

ఫ‌స్ట్ లాక్ అయిపోయింది. ఆ త‌ర్వాత మూడు సార్లు మొత్తంగా క‌రోనా వ‌చ్చి వెళ్లింది. అయినా అనుష్క మాత్రం తెర‌మీద‌కు రాలేదు. అయితే ఎట్ట‌కేల‌కు లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు అనుష్క టాలీవుడ్‌లోకి అడుగు పెట్ట‌బోతోంది. ఈ నెల 4 నుంచి ఆమె కొత్త సినిమా మొద‌ల‌వుతోంది. నవీన్ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ ఓ కొత్త సినిమా ఎప్పుడో స్టార్ట్ చేసింది.

అయితే అది ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలు ఎక్క‌క‌పోవ‌డంతో ఉంటుందా ? ఉండ‌దా ? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇక అనుష్క ఫేడ‌వుట్ అయిపోవ‌డంతో కూడా ఈ సినిమా ఉంటుందా ? అన్న అనుమానాలు కూడా ఎక్కువ అయ్యాయి. అయితే ఈ పుకార్ల‌కు చెక్ పెట్టేశారు నిర్మాత‌లు. సోమ‌వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు రానుంది.

అనుష్క‌కు ఈ బ్యాన‌ర్‌తో చ‌క్క‌ని అనుబంధం ఉంది. గ‌తంలో మిర్చి, భాగ‌మ‌తి సినిమాలు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నారు. అనుష్క‌కు కెరీర్ ప‌రంగా ఇది 48వ సినిమా. వైవిధ్య‌మైన కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు మ‌హేష్‌. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో అనుష్క త‌న నిజ‌జీవిత క‌థ‌లో న‌టిస్తోంద‌నిపిస్తోంది.

క‌థ ప‌రంగా చూస్తే వ‌య‌స్సు అయిపోతున్నా కూడా పెళ్లంటే ఇంట్ర‌స్ట్ లేని అమ్మాయిగా అనుష్క ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంది. అయితే వాస్త‌వంగా చూస్తే కూడా అనుష్క రియ‌ల్ లైఫ్ ఇలాగే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు పెళ్లి అంటూనే ఉంటున్నా.. పెళ్లి మాత్రం చేసుకోవ‌డం లేదు. పోనీ ఇప్పుడు సినిమాలు లేవు.. అనుకున్నా ఇంత‌లోనే సినిమాకు ఓకే చెప్పేసింది. ఇక ఈ సినిమాలో క‌థా ప‌రంగా త‌న కంటే చిన్నోడితో అనుష్క ప్రేమ‌లో ప‌డుతుంద‌ని కూడా టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news