Movies23 ఏళ్ల త‌ర్వాత అలాంటి షాకింగ్ రోల్లో బాల‌య్య‌...!

23 ఏళ్ల త‌ర్వాత అలాంటి షాకింగ్ రోల్లో బాల‌య్య‌…!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అఖండ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అఖండ త‌ర్వాత బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో వ‌స్తోన్న సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సెప్టెంబ‌ర్ నుంచి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే సినిమాలో కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం బాల‌య్య మ‌లినేని గోపీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రెండు పాత్ర‌ల గురించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే పౌరాణికం, సాంఘీకం, చారిత్ర‌కం ఇలా అనేక పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించారు.

అయితే బాల‌య్య ముందు నుంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో న‌టించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. బాల‌య్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించిన సినిమా సుల్తాన్‌. 1999లో వ‌చ్చిన ఈ సినిమాలో బాల‌య్య డ‌బుల్ రోల్ చేశారు. అయితే అందులో ఒక‌టి విల‌న్ రోల్‌. క్లైమాక్స్‌లో ఈ రోల్ మంచిగా మారినా చ‌నిపోతాడు. అయితే సుల్తాన్ బాల‌య్య‌కు నిరాశ‌నే మిగిల్చింది.

సుల్తాన్ త‌ర్వాత బాల‌య్య మ‌ళ్లీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయితే చేయ‌లేదు. అయితే ఇప్పుడు మ‌రోసారి మ‌లినేని గోపీ సినిమాలో ఓ పాత్ర నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఈ సినిమాలో బాల‌య్య రెండు పాత్ర‌లు చేస్తున్నాడ‌న్న విష‌యం అధికారికంగా చెప్ప‌క‌పోయినా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య‌ది రెండు పాత్ర‌లే అంటున్నారు.

ఈ రెండు పాత్ర‌ల్లోనే ఒక‌టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అంటున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌కు కూడా అదిరిపోయే రెస్సాన్స్ వ‌చ్చింది. బాల‌య్య మైనింగ్ ప్రాంతంలో పంచె క‌ట్టులో బ్లాక్ షర్ట్ వేసుకుని చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు. ఇక ఈ నెగిటివ్ పాత్ర‌కే కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా చెల్లిగా క‌నిపించ‌బోతోంద‌ని అంటున్నారు.

అయితే ఈ నెగిటివ్ రోల్ ల‌క్ష్యంతో పాటు అటు హీరో రోల్ ల‌క్ష్యం రెండూ కూడా విల‌న్ల భ‌ర‌తం ప‌ట్టి.. పేద‌ల‌కు న్యాయం చేసేలా గోపీచంద్ క‌థ రాసుకున్నాడ‌ట‌. మ‌రి ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య బ్యాలెన్సింగ్ ఎలా ? ఉంటుందో ? చూడాలి. బాల‌య్య‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విల‌న్‌గా చేస్తున్నాడు. ద‌స‌రాకు ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news