Moviesవాళ్లకి పగిలిపోయే ఆన్సర్ .. అనుష్క రూటే వేరబ్బా..?

వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ .. అనుష్క రూటే వేరబ్బా..?

అనుష్క..అందరు ముద్దుగా టాలీవుడ్ జేజమ్మ అంటుంటారు. అందరికి ఆమె అంటే అంత ఇష్టం. సినిమాలో పాత్ర కోసం ఎలాంటి బట్టలు వేసుకున్నా.. బయటకు వచ్చేటప్పుడు మాత్రం నిండైన వస్త్రాలతో పద్ధతిగా కనిపిస్తుంది. అందుకే అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకపోయినా.. ఆమె ని అభిమానులు ఇంకా లైక్ చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున సూపర్ సినిమా తో పరిచమైన ఈ బ్యూటీ వరుస అవకాశాలను అందుకుంటూ..ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చింది. పెద్దలంటే గౌరవం..చిన్నారుల పట్ల ప్రేమ. అనుకున్నది అనుకున్నట్లు ఫేస్ మీదనే చెపే క్యారెక్టర్.

దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చినా అనుష్క పెళ్లి కి సంబంధించిన గుడ్ న్యూసే చెప్పలేదు. ఈమె పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రేమలో ఉందని.. గత కొన్ని సంవత్సరాలు గా టాక్ వినిపిస్తుంది. అటు ప్రభాస్ కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇటు అనుష్క కూడా సింగిల్ గానే ఉంది. ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చినా అవి అంతా ఫేక్ అంటూ అర్ధమైపోయాయి. పెళ్లి చేసుకుంటా కానీ..టైం పడుతుంది అంటుంది ఈ అమ్మడు. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. ఆమె లాస్ట్ నటించిన సినిమా నిశబ్ధం.

ఆ సినిమా తరువాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. రీజన్ ఏంటో తెలియదు కానీ.. మొన్నటి వరకు ఒక్క సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. రీసెంట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. యూవీ క్రీయేషన్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క ఆంటీ గా నటిస్తుందట. నవీ యంగ్ కుర్రాడి గా కనిపిస్తాదు అన్న టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ యంగ్ కుర్రాడు..ఆంటీ ప్రేమలో పడితే..ఎలా ఉంటుంది అన్నదే సినిమా స్టోరీ. ఈ క్రమంలోనే అనుష్క తన పై బాడీ షేమింగ్ చేసిన వాళ్లకి ..చంప పగిలిపోయే ఆన్సర్ ఇస్తుంది అంటున్నారు మేకర్స్. ఆడవాళ్లు పడే బాధలు గురించి..వయసు వచ్చినా పెళ్లి కానీ అమ్మాయ్ల బాధల గురించి ఈ సినిమాలో అనుష్క మనకు కళ్లకు కట్టిన్నట్లు చూపించబోతున్నారట. మరి చూడాలి..ఈ సినిమా ద్వార అనుష్క కు ఎలాంటి పేరు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news