Moviesప‌వ‌న్ ' హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ' లో మ‌రో క్రేజీ హీరోయిన్...

ప‌వ‌న్ ‘ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ‘ లో మ‌రో క్రేజీ హీరోయిన్ ఫిక్స్‌..!

రీ ఎంట్రీ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ జోరు మామూలుగా లేదు. వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అజ్ఞాత‌వాసి లాంటి ప్లాప్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ గ‌తేడాది వ‌కీల్‌సాబ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెర‌కెక్కింది. ఆ త‌ర్వాత ఈ యేడాది మ‌రో హీరో రానా ద‌గ్గుబాటితో క‌లిసి భీమ్లానాయ‌క్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా కూడా మ‌ల్లూవుడ్ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుం కోషీయ‌మ్‌కు రీమేక్‌గా వ‌చ్చింది.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓకే అనిపించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావ‌డంతో పాటు ప‌వ‌న్ అభిమానులు ఎంజాయ్ చేసే, ప‌వ‌న్ అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ త‌క్కువుగా ఉన్న సినిమాలు కావ‌డం.. ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయాయి.

అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్నాడు. క్రిష్ అంటేనే ఎలాంటి న‌టుడి నుంచి అయినా న‌ట‌న‌ను ఎలా పిండుకుంటాడో తెలిసిందే. క్రిష్ డైరెక్ష‌న్ అంటేనే వైవిధ్యంగా ఉంటుంది. వేదం, కంచె, శాత‌క‌ర్ణి, ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలు ఇవ‌న్నీ క్రిష్ డైరెక్ష‌న్‌లో విల‌క్ష‌ణ‌త చూపిస్తాయి.

ఈ క్ర‌మంలోనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే చారిత్రాత్మ‌క క‌థాంశంలో ప‌వ‌న్ హీరోగా చేస్తుండ‌డం.. అందులోనూ క్రిష్ డైరెక్ష‌న్ కావ‌డంతో ప‌వ‌న్ కెరీర్‌లోనే ఇదో డిఫ‌రెంట్ మూవీ అన్న అంచ‌నాలు అయితే వ‌చ్చేశాయి. పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నిధితో పాటు బాలీవుడ్‌కే చెందిన నపూర్ సనన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో స్టార్ నోరా ఫ‌తేహి కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అటు నిధితో పాటు న‌పూర్‌, నోరా ఫ‌తేహి లాంటి ముద్దుగుమ్మ‌లు ప‌వ‌న్ ప‌క్క‌న క‌నిపిస్తే సినిమా అంతా మాంచి క‌ల‌ర్ ఫుల్‌గా ఉంటుంది. మ‌రి ఈ చారిత్రాత్మ‌క చిత్రం శాత‌క‌ర్ణి రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్న ఈ సినిమాకు మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news