Moviesపుష్ప2 కి అల్లు అర్జున్ కొత్త కండీషన్..పెద్ద ట్వీస్టే ఇచ్చాడుగా. .?

పుష్ప2 కి అల్లు అర్జున్ కొత్త కండీషన్..పెద్ద ట్వీస్టే ఇచ్చాడుగా. .?

పుష్ప..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే..ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోత్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన పుష్ప సినిమా రిలీజ్ అయ్యి చాలా నెలలు గడుస్తున్నా..ఈ డైలాగ్ పవర్ మాత్రం తగ్గడం లేదు. అంత బాగా జనలకెక్కింది ఈ డైలాగ్. అఫ్ కోర్స్ సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లో ఎప్పుడు లేని కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సుకుమార్ పేరు కూడా మారుమ్రోగిపోయింది.

మనకు తెలిసిందే పుష్ప సినిమాను రెండు పార్ట్ లగా తెరకెక్కిస్తాను అని మొదట్లో చెప్పేశాడు సుకుమార్. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్..సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన సుకుమార్..ఇప్పుడు పుష్ప ది రూల్ అంటూ మరో సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత..క్చ్రిప్ట్ లో మార్పుల వల్ల కూత నటీ నటులను తీసుకునే క్రమంలో షూటింగ్ లేట్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభిస్తాము అంటున్నారట టీం.

అయితే , ఈ సినిమా మొదటి భాగం కి 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్..పార్ట్ 2 కి మాత్రం 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్ పుష్ప రాజ్ మాస్ స్టయిల్ కే ఫాన్స్, నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. నార్త్ లో ఎలాంటి అంచనాలు ప్రమోషన్స్ లేకుండానే 100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది పుష్ప. ఇప్పటికే అల్లు అర్జున్ నార్త్ లో పుష్ప రైట్స్ అడుగుతున్నారని,

 

లేదంటే 100 కోట్ల రెమ్యునరేషన్ కావాలని పట్టుబడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. ప్రస్తుతం మైత్రి వారు ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కవేళ ఈ సినిమా కి నిజంగా బన్నీ 100 కోట్లు అందుకుంటే.. ప్రభాస్ తరువాత అంతటి భారీ రెమ్యూనరేషన్ అందుకున్న హీరో గా బన్నీ రికార్డ్ సృష్టించిన్నత్లు అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news