Moviesమీకు తెలుసా..ఆ సీన్ కోసం నిజంగానే ప్రభాస్‌ను కర్రతో కొట్టారట..!!

మీకు తెలుసా..ఆ సీన్ కోసం నిజంగానే ప్రభాస్‌ను కర్రతో కొట్టారట..!!

ప్రభాస్‌.. ఈ పేరు వింటేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకప్పుడు చిన్న సినిమాలతో మొదలు పెట్టిన ఈయన కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ గా కొనసాగుతుంది. ఈ టాలీవుడ్‌ హీరో బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన మన్ డార్లింగ్.. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. బాహుబలి ఈయన జాతకానే మార్చేసింది. ఒకప్పుడు కూడా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఈ రెంజ్ ఫాలోయింగ్ అయితే లేదనే చెప్పాలి. దిన్నంతటికి కారణం..బాహుబలి. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌కి ఇప్పుడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

మరికొద్ది గంటల్లో ఆయన హీరో గా నటించిన చిత్రం “రాధ్యే స్యామ్” సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈయన సినిమాను చూద్దామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ప్రభాస్ బాగా చురుగ్గా పాల్గోన్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్నీ బాషల్లోను కవర్ అయ్యేలా..బాగా ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యుల్లో ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన..ఆయనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా గురించి షాకింగ్ విషయాని రివీల్ చేశారు.

రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ తొలిసారి నటించిన ఛత్రపతి మూవీలో ఓ సీన్ లో నిజంగానే ప్రభాస్ ను కర్ర కొట్టారట. ఆ పుణ్యమంతా కూడా ఆర్ట్‌ డైరెక్టర్‌ దేవంటూ ఫన్నీ గా నవ్వేసాడు. కాగా రాధేశ్యామ్‌ మూవీకి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పనిచేసిన రవిందర్‌ నే.. ఛత్రపతి కి కూడా పని చేశాడట. చత్రపతిలో సినిమాలో ఓ ఫైట్ సీన్ ఉంటాదు గుర్తుందా.. సముద్రం ఒడ్డున ప్రభాస్‌ విలన్‌ కాట్రాజ్‌ల ఫైట్‌..టోటల్ సినిమాకే ఆ సీన్‌ ది బెస్ట్‌ యాక్షన్‌ సీన్‌గా నిలిచింది.

కాగా ఆ సన్నివేశంలో ప్రభాస్‌ను విలన్‌ కర్రతో కోడతాడుకదా… అది నిజంగానే విలన్‌ కాట్రాజ్‌ ప్రభాస్ ను కొట్టాడట. సముద్రం ఉప్పుతో చేసిన నిజమైన కర్రను ఇచ్చి ప్రభాస్ కు కొట్టమన్నారట. కానీ ఈ విషయం ప్రభాస్‌కు, విలన్‌ సుప్రిత్‌కు తెలియదు. దీంతో విలన్‌ సుప్రీత్‌ డూప్‌ కర్ర అనుకుని లాగి గట్టిగా ప్రభాస్ వీపుపై కొట్టాడని..దీంతో తన వీపు పగిలిపోయిందని చెప్పాడు. కాగా 2005లో రాజమౌళి డైరెక్షన్‌ వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. మరి ఇప్పుడు రాబోతున్న రాధేశ్యామ్‌ సినిమా ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news