Moviesబాల‌య్య ప‌క్క‌న ఉన్న ఈమె ఎవ‌రు.. ఈ ఫొటో స్పెషాలిటీ ఏంటి..!

బాల‌య్య ప‌క్క‌న ఉన్న ఈమె ఎవ‌రు.. ఈ ఫొటో స్పెషాలిటీ ఏంటి..!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ వ‌య‌స్సు ఆరు ప‌దులు దాటేసింది. విచిత్రం ఏంటంటే ఒకే కుటుంబంలో బాల‌య్య‌కు ఆ త‌రం జ‌న‌రేష‌న్‌తో పాటు ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్‌.. ఆ కుటుంబంలోనూ ఇప్ప‌టి త‌రం జ‌న‌రేష‌న్ వాళ్లు కూడా వీరాభిమానులుగా ఉన్నారు. ఒకే కుటుంబంలో మూడు త‌రాల వారిని వీరాభిమానులుగా చేసుకున్న ఘ‌న‌త బాల‌య్య‌కే ద‌క్కుతుంది. నంద‌మూరి తార‌క రామారావు న‌ట వార‌సుగా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య ఈ వ‌య‌స్సులో కూడా భీక‌ర‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను, సినీ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాడు. బాల‌య్య మాస్ విశ్వ‌రూపం ఎలా ఉంటుందో ? అఖండ సినిమా చూపించింది.

అఖండ త‌ర్వాత బాల‌య్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఇక బాల‌య్య‌ను చాలా మంది చాలా రోజుల నుంచి.. ఇంకా చెప్పాలంటే ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్లు.. వాళ్ల చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూనే ఉన్నారు. ఆయ‌న్ను గుర్తు ప‌ట్ట‌డం పెద్ద విశేషం కాదు. అయితే ఈ ఫొటోలో బాల‌య్య ప‌క్క‌న ఓ మ‌హిళ ఉన్నారు ? ఆమె ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ? ఆమె ఎవ్వ‌రో కాదు.. బాల‌య్య ధ‌ర్మ‌ప‌త్ని వ‌సుంధ‌ర‌.

పెళ్ల‌యిన కొత్త‌లో తీసుకున్న ఫొటో ఇది. ఈ ఫొటో ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో బాల‌య్య అభిమానులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. బాల‌య్య పెళ్ల‌య్యేట‌ప్ప‌టికే న‌టుడిగా తానేంటో ఫ్రూవ్ చేసుకున్నారు. అప్ప‌టికే అటు త‌న తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణిక సినిమాల్లో న‌టించేశారు. ఇటు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కూడా అందుకున్నారు. ఆ త‌ర్వాతే ఎన్టీఆర్ బాల‌య్య‌కు పెళ్లి చేశారు. ఇక బాల‌య్య – వ‌సుంధ‌ర దంప‌తుల‌ది ఎంతో అన్యోన్య దాంప‌త్యం.

ఈ దంప‌తుల‌కు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని అనే ఇద్ద‌రు కుమార్తెల‌తో పాటు కుమారుడు మోక్ష‌జ్ఞ ఉన్నారు. వీరిలో బ్రాహ్మ‌ణి చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ భార్య‌. మేన‌త్త కొడుకునే బ్రాహ్మ‌ణి పెళ్లి చేసుకుంది. ఇక తేజ‌స్విని కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు, ఇటు మ‌రో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తిల‌కు మ‌న‌వ‌డు అయిన శ్రీ భ‌ర‌త్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇక బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ వెండి తెరంగ్రేటం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news