Moviesకొత్త కారు కొన్న వ‌రుణ్ భార్య వితికా.. క‌ళ్లుచెదిరే రేటు... (వీడియో)

కొత్త కారు కొన్న వ‌రుణ్ భార్య వితికా.. క‌ళ్లుచెదిరే రేటు… (వీడియో)

ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు వ‌రుణ్ సందేశ్‌. కొత్త‌బంగారు లోకం సినిమాతో యూత్‌లో మాంచి రొమాంటిక్ హీరో అయిపోయాడు. ఆ త‌ర్వాత ఒక‌టి, రెండు హిట్లు ప‌డినా కూడా క‌థ‌ల ఎంపిక‌లో లోపాల‌తో ఏకంగా 15 వ‌రుస ప్లాపు సినిమాల్లో న‌టించాడు. వ‌రుస పెట్టి వ‌రున్ న‌టించిన సినిమాలు అన్నీ డింకీలు కొడుతూ వ‌చ్చాయి. ఇక త‌న‌తో న‌టించిన హీరోయిన్ వితాకా షేరునే ప్రేమించి పెళ్లాడాడు. వితికా వాళ్ల‌ది ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో భీమ‌వ‌రం.

వితాకా వాళ్ల కంటే వ‌రుణ్ ఫ్యామిలీ వెల్ సెటిల్‌. వాళ్ల అమ్మ‌, నాన్న అమెరికాలో ఉంటారు. వ‌రుణ్ కూడా ఉన్న‌త చ‌దువులు అక్క‌డే చ‌దివాడు. వ‌రుణ్ కూడా అక్క‌డే సెటిల్ అవుతాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే వ‌రుణ్ మాత్రం సినిమాల‌పై ఆస‌క్తితో ఇక్క‌డ‌కు వ‌చ్చి సెటిల్ అయ్యాడు. వ‌రుణ్ ప్లాపుల్లో ఉన్నా కూడా ఓ క్రేజ్ అయితే ఉంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వితికాతో క‌లిసి ఎంట్రీ ఇచ్చాక వ‌రుణ్ క్రేజ్ మ‌రింత పెరిగింది. బుల్లితెర అభిమానుల‌కు కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యాడు.

బిగ్‌బాస్ హౌస్‌లో వ‌రుణ్‌, వితికా కలిసి హౌస్‌లో మామూలు సంద‌డి చేయలేదు. భార్య‌భ‌ర్త‌లు కావ‌డంతో వీళ్లు పాల్గొన్న సీజ‌న్‌కు కూడా వీళ్లు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఇక తాజాగా వితికా ఓ గుడ్ న్యూస్ త‌న అభిమానుల‌తో పంచుకుంది. తాను కారు కొన్న‌ట్టు త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తాను త‌న జీవితంలో కారు కొంటాను అని అనుకోలేద‌ని.. త‌న‌కు ఓ కారుంటే బాగుంటుంద‌ని అనుకున్నానని.. అయితే ఇంత పెద్ద కారులో తిరిగితే ఎంత బాగుంటుందో అని క‌ల‌లు క‌న్నాన‌ని.. ఇప్పుడు నిజంగానే ఆ కోరిక నెర‌వేరింద‌ని హ్యాపీగా చెప్పింది.

భారత్‌ హ్యుందాయ్‌ అల్కాజార్‌ కారును వితాకా కొనుక్కుంది. ఈ కారు చూసిన కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు. వితికా కారు అదిరిపోయింద‌ని భ‌ర్త వ‌రుణ్ సైతం మెచ్చుకున్నాడు. ఈ కారు ధ‌ర రు. 20 ల‌క్ష‌ల‌కు పైనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వితికా చాలా విష‌యాలు షేర్ చేసుకుంది. త‌మ‌ది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం అని.. భీమ‌వ‌రంలో పుట్టి హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఈ స్టేజ్‌కు వ‌చ్చానంటే అందుకు అభిమానులు, ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలే అని ఆమె చెప్పింది.

తాను కెరీర్ స్టార్టింగ్‌లో రు 2.5 ల‌క్ష‌ల‌తో ఓ కారు కొన్నాన‌ని.. ఇప్పుడు దానికి 10 రెట్లు పెట్టి మ‌రో కొత్త కారు కొనుక్కున్నానంటూ సంతోషం వ్య‌క్తం చేసింది. నా చెల్లి పెళ్లి జరిగాక ఓసారి నా అకౌంట్ చెక్ చేస్తే కేవ‌లం రు. 150 మాత్ర‌మే ఉన్నాయ‌ని.. ఇప్పుడు ఏకంగా ఈ కారు కొనేస్థాయికి రావ‌డం వెన‌క ప్రేక్ష‌కుల ఆశీర్వచ‌నాలే అని ఆనందంతో ఉబ్బిత‌బ్బ‌వుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news