Movies28 ఏళ్ల క్రితం అతిపెద్ద విమాన ప్ర‌మాదం నుంచి బ‌య‌టప‌డ్డ టాలీవుడ్...

28 ఏళ్ల క్రితం అతిపెద్ద విమాన ప్ర‌మాదం నుంచి బ‌య‌టప‌డ్డ టాలీవుడ్ స్టార్స్‌..!

సాధార‌ణంగా విమాన ప్ర‌మాదం జ‌రిగింది అంటే బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డం జ‌రిగే ప‌నికాదు. విమానాలు భూమికి కొన్ని వంద‌లు, వేల కిలోమీట‌ర్ల ఎత్తున ఎగురుతూ ఉంటాయి. ఎక్క‌డ విమానం క్లాష్ అయినా.. ఇంజ‌న్‌లో ఏ లోపం సంభ‌వించినా ఎవ్వ‌రూ బ‌తుకుతారు ? అన్న గ్యారెంటీ అయితే లేదు. ఎవ‌రో ఒక‌రో ఇద్ద‌రో త‌ప్పా విమాన ప్ర‌మాదాల్లో బ‌తికే వారు చాలా త‌క్కువే. సుమారు 28 సంవ‌త్స‌రాల క్రితం మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రూ ప్ర‌యాణిస్తోన్న ఓ విమానం ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 272 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఓ ర‌కంగా ఇది వీళ్ల‌కు పున‌ర్జ‌న్మ అని చెప్పాలి.

272 మందితో వెళుతోన్న విమానం సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేయాల్సిన ప‌రిస్థితి తలెత్తింది. దీంతో ఫైలెట్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో అత్య‌వ‌స‌రంగా ఆ విమానాన్ని ఓ వ‌రి పొలంలో ల్యాండింగ్ చేసేశాడు. అయితే ఏ ఒక్క‌రికి ప్రాణ న‌ష్టం క‌ల‌గ‌కుండా ఆ ఫైలెట్ చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడ‌నే చెప్పాలి. ఈ ఫ్లైట్‌లో మ‌న టాలీవుడ్ ప్ర‌ముఖులు 60 మంది ఉన్నారు. వీరంతా హైద‌రాబాద్ నుంచి చెన్నై వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి – బాల‌కృష్ణ – విజ‌య‌శాంతి – అల్లు రామ‌లింగ‌య్య త‌దిత‌రులు ఉన్నారు.

అప్పుడు ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌రిగి ఉంటే.. అది టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఎప్ప‌ట‌కీ చెర‌గపోని మ‌చ్చ‌లా మిగిలి పోయి ఉండేది. ఆ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కిందకు దిగిన టాలీవుడ్ స్టార్లు చాలా మంది భోరుమ‌న్నాడు. ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని.. ఆ పొలం గ‌ట్ల‌లో కూర్చొని ఏం జ‌రుగుతుందో ? అర్థం కాక ఏడ్చేశారు. అయితే స‌మీపంలో పొలాల్లో ప‌ని చేసుకుంటోన్న కూలీలు ప‌రుగు ప‌రుగున అక్క‌డ‌కు వ‌చ్చి సినీ స్టార్స్‌ను చూసి ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అయితే వెంట‌నే వారు త‌మ వంతుగా సాయం చేసి.. వారికి ధైర్యం చెప్ప‌డం విశేషం.

అప్ప‌ట్లో ఈ సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగానే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. సినిమా స్టార్స్‌కు ఏదేదో అయిపోయింద‌న్న వార్త దాన‌వాలంలా వ్యాపించ‌డంతో తెలుగు ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మ‌రుస‌టి రోజు పేప‌ర్ల‌లో ఈ వార్తే హైలెట్‌. ఎవ‌రు ఈ ప్ర‌మాదంలో ఎంత టెన్ష‌న్ అనుభ‌వించారో కూడా త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news