Moviesపుష్ప-2లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌..ఏం వాడకం అయ్యా నీది..ఎవ్వరిని వదలవే..?

పుష్ప-2లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌..ఏం వాడకం అయ్యా నీది..ఎవ్వరిని వదలవే..?

పుష్ప..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే.. వామ్మో ఈ డైలాగ్ అంటే పడి చచ్చిపోతున్నారు జనాలు. అంత బాగా అందరికి నచ్చేసింది. అది మన బన్నీ చెప్పే స్టైల్ లో అయితే సూపర్ గా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యి..ఓటీటీలోకి కూడా వచ్చేసినా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. సుకుమార్ అంత బాగా మాయ చేశాడు ఈ సినిమాతో.

నిజానికి ఈ సినిమా స్టోరీ ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించినది అని షూటింగ్ మొదలైనప్పుడే చెప్పారు. దీంతో సినిమా అసలు లైన్ ముందే చెప్పేశారు ఇంకసినిమాలో ఏముంటుంది..పైగా బన్నీ అలాంటి మాస్ పాత్రలో చూడలేం..సినిమా ఫట్ అంటూ తెగ రివ్యూలు రాసేశారు. కానీ..సీన్ కట్ చేస్తే..బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫస్ట్ మూడు రోజులు కొంచెం మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నా..ఫైనల్ గా మాత్రం వావ్..బన్నీ చించేశాడు..అన్నా మాటలే ఎక్కువ వినపడాయి. ఒక నటుడికి అంతా కన్నా కావాల్సింది ఏముంటాది చెప్పండి.

ఇక పుష్ప పార్ట్ 2 అదేనండి పుష్ప ది రూల్ మరి కొన్ని వారాల్లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు సుక్కు. పుష్ప ది రైజ్ లో చేసిన తప్పులని ఈ పార్ట్ 2 లో కవర్ చేయబోతున్నాడంటూ ఇప్పటికే టాక్ మొదలైంది. అయితే పుష్’ సినిమాలో ఉన్న నటీనటులే పుష్ప 2 లో ఉంటారని గతంలో సుకుమార్‌ క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు కథలో కొన్ని మార్పులు చేసి, అందుకు తగ్గట్టే పాత్రలను ఎంచుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందులో భాగంగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ ని ..పుష్ప 2 లో తీసుకోవడానికి పాత్రను రెడీ చేశాడట. ఆమె కోసమే ఈ సినిమాలో ఓ కీ రోల్‌ సృష్టించి..సెకండాఫ్ మొత్తం ఇంద్రజ నే కనిపించెలా..ఆ పాత్ర బన్నీ లో మార్పులు తీసుకొచ్చి..స్మగ్లింగ్ ఆపేసేలా చేస్తుంది అంటూ ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంద్రజ తో సుక్కు చర్చలు కూడా జరిపాడట. దానికి ఆమె ఓకే చెసిన్నట్లు సమాచారాం. ఏది ఏమైనా సుక్కు టైమింగ్ కేక..నటన పరంగా అందరిని వాడేసుకుంటున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news