Moviesఈ టాలీవుడ్ జంట‌లు విడిపోవ‌డానికి విచిత్ర‌మైన కార‌ణాలు..!

ఈ టాలీవుడ్ జంట‌లు విడిపోవ‌డానికి విచిత్ర‌మైన కార‌ణాలు..!

సినిమా వాళ్లు ఎప్పుడు ప్రేమించుకుంటారో ? ఎప్పుడు విడిపోతారో ? తెలియ‌దు. ఇప్పుడు సినిమా సెల‌బ్రిటీల మ‌ధ్య ప్రేమ‌లు, ఎఫైర్లు, స‌హ‌జీవ‌నాలు.. ప్రేమ‌లు, విడాకులు అనేవి చాలా కామ‌న్ అయిపోయావి. ఇక కొన్ని జంట‌లు అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని విచిత్ర‌మైన కారణాల‌తో విడిపోయాయి. ఆ జంట‌లేవో చూద్దాం.

ర‌ష్మిక – ర‌క్షిత్ శెట్టి :
క‌న్న‌డంలో స్టార్ హీరోయిన్‌గా చెలామ‌ణి అవుతోన్న ర‌ష్మిక మంద‌న్న‌కు క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. అప్పుడు ర‌ష్మిక మాంచి ఫామ్‌లో ఉంది. విచిత్రం ఏంటంటే ఎంగేజ్‌మెంట్ జ‌రిగాక ర‌ష్మిక‌కు తెలుగులో స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా అవ‌కాశాలు రావ‌డంతో ఆమె ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఓ విధంగా ఈ పెళ్లి క్యాన్సిల్ కావ‌డం వెన‌క టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అని ఓ ప్ర‌చారం కూడా ఉంది. మ‌రి ఇందులో నిజానిజాలేంటో వారికే తెలియాలి.

మెహ్రీన్ :
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఎంగేజ్‌మెంట్ హ‌ర్యానాకు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ వేత్త‌ల కుటుంబానికి చెందిన భ‌వ్య భిష్ణోయ్‌తో జ‌రిగింది. వీరు పెళ్లిపీట‌లు ఎక్క‌డ‌మే త‌రువాయి అనుకుంటోన్న టైంలో వీరి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. మోహ్రీన్‌కు ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత సినిమాలు చేయ‌కూడ‌ద‌న్న కండీష‌న్ ఉండ‌డంతో అది న‌చ్చ‌కే ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుంద‌ని అంటారు.

 

అఖిల్‌:
అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ – ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలు శ్రియా భూపాల్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఇటలీలో వీరి పెళ్లి వైభ‌వంగా చేసేందుకు నాగార్జున భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త టి సుబ్బారామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ ఫంక్ష‌న్లో అఖిల్ – శ్రియా మ‌ధ్య డ్యాన్స్ చేసే విష‌యంలో జ‌రిగిన చిన్న గొడ‌వ పెద్ద‌దిగా మారి చివ‌ర‌కు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. అఖిల్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత శ్రియా భూపాల్ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌న‌యుడిని పెళ్లి చేసుకోగా.. అఖిల్‌కు ఇంకా పెళ్లి కాలేదు.

మెగాస్టార్ కుమార్తె సుస్మిత – ఉద‌య్ కిర‌ణ్ :
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌, దివంగ‌త హీరో ఉద‌య్‌కిర‌ణ్‌కు పెద్ద‌ల స‌మ‌క్షంలో 2003లో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. వ‌రుస హిట్ల‌తో ఉద‌య్‌కిర‌ణ్‌కు తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. అలాగే సుస్మిత‌యే ఉద‌య్‌ను ప్రేమించ‌డంతో చిరు కోరిక మేర‌కే ఉద‌య్ కిర‌ణ్ సుస్మిత‌ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడ‌ని కూడా అంటారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. సుస్మిత‌ కండీష‌న్ల‌తో ఉద‌య్ ఈ పెళ్లికి నో చెప్పేశాడు. ఆ త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ విషిత‌ను, సుస్మిత విష్ణుప్ర‌సాద్‌ను పెళ్లి చేసుకున్నారు.

త్రిష :
సీనియ‌ర్ హీరోయిన్ త్రిష‌.. పారిశ్రామిక‌వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని రింగ్‌లు కూడా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత నటన వద్దనే విషయం వద్ద ఇద్దరికి గొడవలు రావడంతో విడిపోయారు. త్రిష సినిమాలతో బిజీగా ఉండగా, వరుణ్ హీరోయిన్ బిందు మాధవితో డేట్ లో ఉన్నాడు.

న‌య‌న‌తార – ప్ర‌భుదేవా :
ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకీ గ‌తంలో ర‌మ్‌ల‌త‌తో పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్నారు. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవా – న‌య‌న‌తార ప్రేమించి పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌భుదేవాను పెళ్లి చేసుకునేందుకు న‌య‌న‌తార మ‌తం మార్చుకునేందుకు కూడా సిద్ధ‌ప‌డింది. కానీ ఏం జ‌రిగిందో కాని వీరు విడిపోయారు. వీరు ఎందుకు విడిపోయారు ? అన్న‌ది ఇప్ప‌ట‌కీ మిస్ట‌రీయే ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news