Moviesఅడ‌గ‌క పోయినా క‌మిట్‌మెంట్లు ఇస్తోన్న స్టార్ హీరోయిన్లు... ఆ మెసేజ్‌లో ఏం...

అడ‌గ‌క పోయినా క‌మిట్‌మెంట్లు ఇస్తోన్న స్టార్ హీరోయిన్లు… ఆ మెసేజ్‌లో ఏం ఉంది..!

సినిమా రంగం అనేది గ్లామర్ రంగం. ఈ గ్లామర్ రంగంలో సహజంగానే ఆకర్షణలు – అవకాశాలు – అవకాశవాదులు కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ల విషయంలో కాస్టింగ్ కౌచ్ అనేది గత కొంతకాలంగా పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంది హీరోయిన్లు తమ జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓపెన్‌గా చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్, కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ – దక్షిణాదిలో శ్రీ రెడ్డి – కోలీవుడ్లో సింగర్ చిన్మ‌యి ఇలా చాలామంది కాస్టింగ్ కౌచ్ పై పెద్ద పోరాటమే చేస్తున్నారు.

తెలుగులోనే మరో హీరోయిన్ పూనమ్‌కౌర్ సైతం తనను ఓ స్టార్ హీరో లైంగికంగా వేధించాడని పెద్ద బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ సింగర్ మాజీ భార్య హీరోయిన్ ఎస్తేర్ నోరాన్సా గురించి మనందరికీ తెలిసిందే. క్లాసికల్ సింగర్, డ్యాన్సర్ అయిన ఆమె పాపుల‌ర్ సింగర్ నోయ‌ల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కేవలం ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. నోయల్ కెరీర్ కన్నడ ఇండస్ట్రీలో ప్రారంభమైంది. కన్నడంలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసిన‌ ఆమె ఆ తర్వాత తెలుగులో సునీల్ హీరోగా వచ్చిన భీమవరం బుల్లోడు లో హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత వెయ్యి అబద్దాలు – జ‌య‌ జానకి నాయక లాంటి సినిమాల్లో నటించినా అనుకున్నా గుర్తింపు రాలేదు. త‌న‌కు సరైన ఆఫర్లు రాకపోవడానికి కాస్టింగ్ కౌచ్ కారణమని ఆరోపిస్తోంది. కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆఫర్లకు లొంగిపోయిన హీరోయిన్ల బాగోతాన్ని కూడా బయటపెట్టింది. హీరోయిన్లు అవకాశాల కోసం తెరచాటుగా చాలా వ్యవహారాలు నడుపుతారని బాంబు పేల్చింది. ఇండస్ట్రీలో తనకు చాలా అన్‌ ప్రొఫెషనల్ ట్రాక్స్‌ కనిపించాయని…. సినిమా ఆఫర్లతో పాటు ఈ ఆఫర్లు కూడా వస్తుంటాయని…. వాళ్లని ఏదోలా శాటిస్‌ఫై చేయాలి అని అడిగేవాళ్లు చాలామందే ఉన్నారని ఆరోపించింది.

కొందరు హీరోయిన్లు అయితే అడగకపోయినా తామే కమిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటారన్న ఎస్తేర్‌… ఆఫర్ ఇస్తే తాము ఏది చేయడానికైనా రెడీ అని నాతో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు అని చెప్పింది. అంతే కాకుండా ఇప్పుడు ఉన్న‌ పాపులర్ హీరోయిన్లు… స్టార్ హీరోయిన్లు గా ఉన్న వాళ్లు సైతం కొన్ని మెసేజ్‌లు నాకు చూపించి నన్ను కూడా కన్విన్స్ చేసేందుకు చాలా ప్రయత్నించారని ఆమె చెప్పింది. సహజంగా కమిట్మెంట్ లను మగవాళ్ళు ఆడ‌వాళ్ల‌ను అడగటం ఒక ఎత్తు అయితే… ఈ స్టార్ హీరోయిన్లు మాత్రం వాళ్లు అడగకుండానే ఆఫర్‌ చేయటం అనేది కూడా ఇండస్ట్రీలో ఉందని చెప్పింది. అయితే ఆ స్టార్ హీరోయిన్ల పేర్లు చెప్పేందుకు ఆమె ఒప్పుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news