MoviesRRR ఏపీ, తెలంగాణ‌లో బ్రేక్ఈవెన్ టార్గెట్ ఇదే... వామ్మో ఇన్ని కోట్లు...

RRR ఏపీ, తెలంగాణ‌లో బ్రేక్ఈవెన్ టార్గెట్ ఇదే… వామ్మో ఇన్ని కోట్లు ఎలా వ‌స్తాయ్‌..!

ఒక‌టి కాదు రెండు కాదు… నెల‌లు కాదు… ఒక‌టీ రెండు సంవ‌త్స‌రాలు కాదు.. ఏకంగా మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా వ‌చ్చే ఐదేళ్లు అవుతోంది. రాజ‌మౌళి సినిమా కోసం మామూలుగానే ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రే క్రేజీ స్టార్స్ ఉన్నారు. దీంతో అటు ఎన్టీఆర్‌, నంద‌మూరి ఫ్యాన్స్‌, ఇటు మెగా అభిమానుల సంద‌డి, హంగామా తెలుగు నాట మామూలుగా లేదు.

ఈ సినిమాను ముందుగా రు. 250 కోట్ల బ‌డ్జెట్‌తో అనుకుంటే.. చివ‌ర‌కు అది క‌రోనా కార‌ణంగా వాయిదాలు ప‌డి.. వ‌డ్డీలు అన్ని క‌లిపి చివ‌ర‌కు రు. 500 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమా చేసిన ప్రి రిలీజ్ బిజినెస్‌.. ఈ సినిమా టార్గెట్ చూస్తే క‌ళ్లు జిగేల్ మ‌న‌డంతో పాటు మ‌తులు పోతున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో త్రిబుల్ ఆర్ సేఫ్ జోన్‌లోకి రావాలంటే రు. 190 కోట్లు వ‌సూలు చేయాల్సి ఉంటుంది.

కేవ‌లం ఏపీ, తెలంగాణ‌లో రు. 190 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు.. మ‌న తెలుగు సినిమాలు సూప‌ర్ హిట్ అయితే ఏదోలా రు. 100 కోట్ల షేర్ వ‌ర‌కు చేరుకుంటున్నాయి. అయితే త్రిబుల్ ఆర్‌కు అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తేనే ఈ షేర్ టార్గెట్ రీచ్ అవుతుంది. రు. 190 కోట్ల షేర్ అంటే ఎలా లేద‌న్నా రు. 250 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఎంత లేద‌న్నా ఈ సినిమాకు నెల రోజుల పాటు క‌నీస లాంగ్ ర‌న్ ఉండాలి.

మ‌రో వైపు ఈ సినిమా వ‌చ్చాక సౌత్ ఇండియాలోనే కాకుండా.. అటు నార్త్‌లో కూడా భారీ అంచ‌నాలు ఉన్న కేజీఎఫ్ 2 వ‌స్తోంది. అంటే రెండు వారాల పాటే ఈ సినిమాకు ప్రీ ర‌న్ ఉంటుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా కేజీఎఫ్ 2, ఆచార్య వ‌చ్చేస్తాయి. బాహుబ‌లి 1,2 కు కూడా ఏకంగా 50 రోజుల పాటు ఏ పెద్ద సినిమా కూడా అడ్డు రాలేదు. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్‌కు ఆ స్పేస్ అయితే ఉండ‌దు. పైగా మే 12న స‌ర్కారు వారి పాట కూడా ఉంది. ఈ మ‌ధ్య‌లో ర‌వితేజ లాంటి హీరోల సినిమాల‌కు కూడా ఖ‌ర్చీఫ్ వేసుకుంటున్నాయి.

ఏదేమైనా ఏపీ, తెలంగాణ‌లో త్రిబుల్ ఆర్‌కు ఫ‌స్ట్ రెండు వారాలే చాలా కీల‌కం కానున్నాయి. అప్ప‌టి లోగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేస్తే ఎలాంటి రిస్క్ ఉండ‌దు. లేక‌పోతే లాంగ్ ర‌న్‌లో ఎంత వ‌ర‌కు ఉంటుంది ? మిగిలిన సినిమాల రిజ‌ల్ట్‌ను బ‌ట్టే త్రిబుల్ ఆర్ వ‌సూళ్లు ఎలా ఉంటాయో డిసైడ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news