Movies' రాధేశ్యామ్ ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... డిజాస్ట‌ర్‌కు అమ్మ మొగుడురా...

‘ రాధేశ్యామ్ ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌… డిజాస్ట‌ర్‌కు అమ్మ మొగుడురా బాబు..!

రాధేశ్యామ్ ఫ‌స్ట్ డే రిజ‌ల్ట్ చూసిన త‌ర్వాతే చాలా మందికి సినిమా నిల‌బ‌డ‌దు అన్న సందేహాలు వ‌చ్చేశాయి. అయితే త్రిబుల్ ఆర్ 25న రావ‌డంతో.. అప్ప‌టి వ‌ర‌కు చాలా టైం ఉంది. ఏదైనా అద్భుతం జ‌రుగుతుందేమో ? సాహో కూడా నెగిటివ్ టాక్‌తో నార్త్‌లో రు. 150 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిందిగా.. రాధేశ్యామ్ విష‌యంలోనూ అంతే జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ప్ర‌భాస్ అభిమానులు కూడా ఇదే అశ‌ల‌తో ఉన్నారు. అయితే ఆ ఆశ‌లు అన్నీ ప‌టాపంచ‌లు అయిపోయాయి.

రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ అన్న‌ది తేలిపోయింది. మొద‌టివారం 80 శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా నాలుగో రోజు నుంచే తేలిపోయింది. నిన్న‌టితో వారం రోజుల ర‌న్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌భాస్ కెరీర్‌లో సాహోను మించిన డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఏపీ, నైజాంలో రాధేశ్యామ్ వారం రోజుల్లో రు. 55 కోట్ల షేర్ సాధించింది. ఈ మాత్రం వ‌సూళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిజాస్ట‌ర్ సినిమాల‌కు ఒక‌టి, రెండు రోజుల్లోనే వ‌చ్చేవి.

ఈ సినిమాను ఏపీ, తెలంగాణ‌లో రు. 100 కోట్ల‌కు పైగా ( హ‌య్య‌ర్స్‌తో క‌లిపి) అమ్మారు. ఆ మొత్తం రాద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఏపీ, నైజాంలో క‌లిపి రు. 40 కోట్ల న‌ష్టం త‌ప్పేలా లేదు. ఒక్క నైజాంలోనే రు. 15 కోట్ల న‌ష్టాలు వ‌చ్చేలా ఉంది. ఇటు నార్త్‌లో.. హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. వారం రోజుల వ‌సూళ్లు చూస్తే అక్క‌డ రు. 20 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. ప్ర‌స్తుతం అక్క‌డ క‌శ్మీర్ ఫైల్స్ సినిమా దూకుడు ముందు రాధేశ్యామ్ బేజారు అయ్యింది. అస‌లు ఈ సినిమాను ప‌ట్టించుకునే వాళ్లే లేరు.

ఇక సౌత్‌లో చూస్తే తెలుగులో మాత్ర‌మే కాదు.. త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డంలో కూడా ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అస‌లు ఈ మూడు భాష‌ల్లో ఈ సినిమాను ప‌ట్టించుకునే వారే లేరు. ఉన్నంత‌లో ఒక్క ఓవ‌ర్సీస్‌లో మాత్ర‌మే రాధేశ్యామ్ ర‌న్ బాగుంది. అయితే రేపు, ఎల్లండిలో ఆ ర‌న్ కూడా అక్క‌డ ముగిసిపోనుంది. వ‌చ్చే వారం అక్క‌డ ఆర్ ఆర్‌ దిగుతోంది. అస‌లు త్రిబుల్ ఆర్ వ‌స్తే ఏ సినిమాలు కూడా ఆ సినిమా ముందు నిలిచే ఛాన్సులే లేవు.

ఓ వైపు వ‌సూళ్లే ప‌డిపోయాయి అనుకుంటే .. మ‌రోవైపు థియేట‌ర్లు కూడా ఈ సినిమాకు త‌గ్గిపోయాయి. ఈ రోజు రాజ్‌త‌రుణ్ న‌టించిన స్టాండ‌ప్ రాహుల్‌తో పాటు మ‌రో 4 చిన్న సినిమాలు రావ‌డంతో ఆ సినిమాల‌కు చాలా థియేట‌ర్లు ఇచ్చేశారు. మ‌రో వైపు రాధేశ్యామ్ ప్లాప్‌తో భీమ్లానాయ‌క్ పుంజుకుంది. రెండో వారంలోకి వ‌చ్చేస‌రికే ఏపీ, నైజాంలో రాధేశ్యామ్ స్క్రీన్ల సంఖ్య 500కు ప‌డిపోయింది అంటేనే ఈ సినిమా ప‌ట్ల థియేట‌ర్ల వాళ్ల‌కు, బ‌య్య‌ర్ల‌కు, ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి లేద‌న్న‌ది తేలిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news