Moviesఆ హిట్ డైరెక్ట‌ర్ సినిమాలో అథ్లెట్‌గా తార‌క్‌... టైటిల్ కూడా కొత్త‌గా...

ఆ హిట్ డైరెక్ట‌ర్ సినిమాలో అథ్లెట్‌గా తార‌క్‌… టైటిల్ కూడా కొత్త‌గా ఫిక్స్ చేశారే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ త్రిబుల్ ఆర్‌తో ఈ నెల 25న థియేట‌ర్లలోకి దిగ‌నున్నాడు. మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం డేట్లు ఇచ్చేసిన ఎన్టీఆర్ ఆయ‌న ఫ్యాన్స్‌ను ఓ విధంగా డిజ‌ప్పాయింట్ చేశాడ‌నే చెప్పాలి. క‌రోనా టైంలో ఎన్టీఆర్ ప్లానింగ్‌తో ఉండి ఉంటే ఈ పాటికే ఒక‌టో రెండు సినిమాలు షూటింగ్‌లో సెట్స్ మీద ఉండేవి. ప్ర‌స్తుతం కొర‌టాల శివ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ లైన‌ప్‌లో ప్ర‌శాంత్ నీల్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా ఉంది.

త్రిబుల్ ఆర్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునే క్ర‌మంలో ఎన్టీఆర్ పాన్ ఇండియా క‌థ‌ల మీదే మొగ్గు చూపుతున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల‌తో చేస్తోన్న సినిమా కూడా పాన్ ఇండియా స్టోరీయే..! అందుకే ఆలియా భ‌ట్‌ను హీరోయిన్‌గా తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ప్ర‌శాంత్ నీల్ సినిమా అంటే ఎలాగూ పాన్ ఇండియా సినిమాయే అవుతుంది. ఇక బుచ్చిబాబు సానా కూడా ఎన్టీఆర్ కోస‌మే కాచుకుని ఉన్నాడు.

ఉప్పెన త‌ర్వాత ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా బుచ్చిబాబు ఓకే చెప్ప‌లేదు. ఎన్టీఆర్ ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడే సినిమా అంటున్నాడు. మైత్రీ మూవీస్ వాళ్లు బుచ్చిబాబుకు అడ్వాన్స్ ఇచ్చేశారు. బుచ్చిబాబు కూడా క‌థ‌ను మ‌రింత‌గా చెక్కుతున్నాడు. ఇక బుచ్చిబాబుకు – ఎన్టీఆర్‌కు చాలా స్నేహం ఉంది.. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు బుచ్చిబాబు సుకుమార్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు.

అప్పుడు సుకుమార్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేయ‌డంతో ఇండియా వ‌చ్చేశాడు. కొన్ని బ్యాలెన్స్ సీన్ల‌ను షూట్ చేసే బాధ్య‌త బుచ్చిబాబుకు అప్ప‌గించాడు. అలా ఎన్టీఆర్ – బుచ్చిబాబు మ‌ధ్య అప్ప‌టి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ అథ్లెట్‌గా క‌నిపిస్తాడ‌ట‌. ఇది స్పోర్ట్స్ నేప‌థ్యంలో సాగే క‌థ అని.. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నార‌న్న ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది.

సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు పెద్ది.. ఆ పాత్ర‌నే టైటిల్‌గా పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ క‌థ స్పోర్ట్స్ నేప‌థ్యంలో కొన‌సాగే క‌థ కావ‌డంతో.. పాన్ ఇండియా నేప‌థ్యంలోనే ఈ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రో గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ 11న ఈ సినిమాపై మైత్రీ వాళ్లు అఫీషీయల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. కొర‌టాల ప్రాజెక్ట్ ముగిసిన వెంట‌నే ఇది సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news