Moviesవారెవ్వా..మెగా హీరోతో నేహా శెట్టి..బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!!

వారెవ్వా..మెగా హీరోతో నేహా శెట్టి..బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!!

డీజే టిల్లు..ఈ పేరు చెప్పితే అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు. ఎటువంటి అంచానాలు లేకుండా ధియేటర్స్ లో రిలీజై..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సిద్ధు జొన్నల‌గ‌డ్డ – నేహాశెట్టి జంట‌గా వ‌చ్చిన సినిమా డీజే టిల్లు. థియేట‌ర్ల‌లో తొలి ఆట‌కే సూప‌ర్ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. అంతేనా ఈ సినిమాతో పోటీగా వచ్చిన మాస్ మహా రాజ రవితేజ సినిమాను చితూ చిత్తుగా ఓడించి..అట్టర్ ఫ్లాప్ గా నిల్చోబెట్టింది. ఈ సినిమా తొలి రోజుకే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసి రెండో రోజు నుంచే లాభాల్లోకి వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా ద్వారా హీరో సిద్ధు ఇండట్రీలో మరో విజయ్ దెవరకొండ గా పేరు తెచ్చుకున్నాడు. రాధిక రాధిక అంటూ ఆ స్లాంగ్ లో మాట్లాడుతూ..తెర పై మరో విజయ్ ని చూపించాడు అంటున్నారు అభిమానులు.

ఈ సినిమా ద్వారా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక డీజే టిల్లు సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న కుర్ర భామ నేహా శెట్టి ఇప్పుడు కళ్ళు నెత్తిన పెట్టుకుని బీహేవ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఒక్కటంటే ఒక్కటే హిట్ కొట్టిన ఆమె రెమ్యూనరేషన్ విషయంలో అస్స‌లు ఏ మాత్రం త‌గ్గే ప్ర‌శ‌క్తే లేద‌ని చెపుతోంద‌ట‌. సాధార‌ణంగా హీరోయిన్లు ముందు రెండు, మూడు సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్లు డిమాండ్ చేయ‌రు. నిర్మాత‌లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. కానీ ఈ భామ నాకు కావాల్సిన అమౌంట్ ఇస్తేనే సినిమాలకి సైన్ చేస్తా అంటుందట.

అయితే, రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించే అవకాశం కొట్టేసింది ఈ హాట్ బ్యూటీ. అయితే ఈ అవకాశం సినిమాలో కాదు ఒక యాడ్ లో. బన్నీ ప్రముఖ్ ఫుడ్ డెలివరీ యాప్ జొమెటో కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా దీని కి సంబంధించిన ఓ షూట్ కోసం అర్జున్ పక్కన నేహాను తీసుకున్నారు.

వీరిద్దరూ కలిసి చేసిన కొత్త యాడ్ కు సంబంధించిన జోమాటో కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా అల్లు అర్జున్ తో యాడ్ మాట్రమే కాదు సినిమా లో కూడా నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news