Moviesబాల‌య్య ముద్దుగుమ్మ‌తో నాగార్జున రొమాన్స్ మామూలుగా లేదే..!

బాల‌య్య ముద్దుగుమ్మ‌తో నాగార్జున రొమాన్స్ మామూలుగా లేదే..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ వ‌య‌స్సులోనూ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడే. ఈ వ‌య‌స్సులోనూ నాగార్జున కుర్ర హీరోయిన్ల‌తో రొమాన్స్‌కు సై అంటూనే ఉంటాడు. తాజాగా సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయ‌నా లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన బంగార్రాజుతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. బంగార్రాజు నాగార్జున కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నిలిచింది. పైగా నాగార్జున – చైతు క‌లిసి న‌టించ‌డంతో మాంచి మెమ‌ర‌బుల్ సినిమాగా కూడా నిలిచిపోయింది.

ఈ క్ర‌మంలోనే నాగార్జున ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. క్రేజీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున స్టైలీష్ లుక్ చాలా కొత్త‌గా ఉంది. ఘోస్ట్ టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ ఫీల్‌తో ఆ అదిరిపోయే బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ దుబాయ్‌లో స్టార్ట్ అయ్యింది.

ఈ షెడ్యూల్‌కు సంబంధించిన స్టిల్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో నాగార్జున స‌ర‌స‌న ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. ఆమె ఫేడ‌వుట్ అయిపోవ‌డంతో ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌డం లేదు. సీనియ‌ర్ హీరోయిన్ బాల‌య్య మాత్ర‌మే లెజెండ్ – డిక్టేట‌ర్ – రూల‌ర్ మూడు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున‌కు ఆమే హీరోయిన్‌గా దిక్కైంది. తాజాగా రిలీజ్ అయిన స్టిల్ చూస్తుంటే సోనాల్ త‌న‌కు అల‌వాటు అయిన రీతిలోనే మోకాళ్ల‌కు పైనే డ్రెస్ వేసుకుని కావాల్సిన‌ట్టుగా అందాలు చూపిస్తోంది.

ఆమె ప‌క్క‌నే నాగార్జున చాలా స్టైలీష్‌గా నుంచొని ఉన్నాడు. మ‌న్మ‌థుడు 2 సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌తోనే లిప్ లాక్ చేసి విమ‌ర్శ‌ల‌కు గురైన నాగార్జున ఇప్పుడు సోనాల్‌తో కూడా అదే స్టైల్లో రొమాన్స్ చేస్తున్న‌ట్టుగా ఉంది. ఏదేమైనా నాగార్జున కెరీర్‌లోనే పెద్ద యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను ప్ర‌వీణ్ స‌త్తార్ ప్ర‌జెంట్ చేస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news