Moviesకేజీఎఫ్ 2: ప‌వ‌ర్‌ఫుల్ తుఫాన్ వ‌చ్చేసింది... అరాచ‌కమే (వీడియో)

కేజీఎఫ్ 2: ప‌వ‌ర్‌ఫుల్ తుఫాన్ వ‌చ్చేసింది… అరాచ‌కమే (వీడియో)

క‌న్న‌డ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్‌. 2018లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా దేశ‌వ్యాప్తంగానే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. చివ‌ర‌కు క‌న్న‌డంలో బాహుబలిలా ఓ ప్రాంతీయ భాషా చిత్రంగా రిలీజ్ అయిన కేజీఎఫ్ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాళం.. అటు నార్త్‌లోనూ దుమ్ము రేపేసింది. చివ‌ర‌కు ఈ సినిమా క‌న్న‌డ బాహుబ‌లిగా నిలిచింది.

క‌ర్నాక‌ట‌లో కోలార్ గోల్డ్‌ఫీల్డ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 కూడా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేజీఎఫ్ 2ను ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రుర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతూ ఉండ‌డంతో ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేశారు.

ఇక కేజీఎఫ్ 2 ట్రైల‌ర్‌ను ఈ నెల 27న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా నుంచి తుఫాన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 3.33 నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నాయి. సాంగ్ వింటుంటే దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న కేజీఎఫ్ 2 తెలుగుతో పాటు క‌న్న‌డం, హిందీ, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news