Moviesఎన్టీఆర్ రెండు నెల‌ల విశ్రాంతి వెన‌క ఇంత క‌థ ఉందా...!

ఎన్టీఆర్ రెండు నెల‌ల విశ్రాంతి వెన‌క ఇంత క‌థ ఉందా…!

ఒక నెలా రెండు నెల‌లా… పోనీ ఆరు నెల‌లో యేడాదో కాదు.. రాజ‌మౌళి ఎన్టీఆర్‌ను ఏకంగా మూడేళ్లు త‌న కాలికి క‌ట్టేసుకున్నాడు. ఒక్క త్రిబుల్ ఆర్ సినిమా కోసం మూడున్న‌ర సంవ‌త్స‌రాలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. అయితే అందుకు రాజ‌మౌళిని మాత్ర‌మే పూర్తిగా త‌ప్పుప‌ట్ట‌లేం.. అందులో కరోనా త‌ప్పు కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకున్నాక ఏకంగా మూడు సార్లు క‌రోనా వ‌చ్చింది. మొన్న సంక్రాంతికి సినిమా ఖ‌చ్చితంగా వ‌చ్చేస్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌మోష‌న్లు కూడా చేశారు. చివ‌ర‌కు క‌ట్ చేస్తే ఒమిక్రాన్ దెబ్బ‌తో వాయిదా ప‌డింది. ఇక ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన త్రిబుల్ ఆర్ కేవ‌లం మూడు రోజుల్లోనే రు. 500 కోట్లు క్రాస్ చేసేసింది.

ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సిసిమాను కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్ చేస్తున్నారు. నార్త్‌లో మాంచి అప్పీల్ కోస‌మే అలియాభ‌ట్‌ను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ సోద‌రుడు నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

చిరు న‌టించిన ఆచార్య సినిమా వ‌చ్చే నెల 29న రిలీజ్ అవుతోంది. కొర‌టాల శివ ఈ సినిమా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రమోష‌న్ల‌లో బిజీగా ఉన్న శివ అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడ‌న్న గ్యారెంటీ లేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కూడా వారం, ప‌ది రోజుల పాటు ఆ ప్ర‌మోష‌న్ల‌లోనే శివ బిజీగా ఉంటాడు. అయితే ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీతో విదేశీ టూర్‌కు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

మూడేళ్లుగా త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడో సినిమా చూస్తేనే తెలుస్తోంది. జ‌క్క‌న్న టేకుల మీద టేకులు, షాట్స్ మీద షాట్లు తీసి ఎంతో టార్చ‌ర్ పెట్టాడ‌ని కూడా చెప్పాడు. ఓ షాట్ కోసం 18 టేకులు చేయించాక‌.. చివ‌ర‌కు రెండో షాట్ ఓకే చేశాడ‌ట‌. దీనిని బ‌ట్టే ఈ సినిమాకు తార‌క్ ఎంత‌లా హార్డ్ వ‌ర్క్ చేశాడో తెలుస్తోంది.

ఇక కొర‌టాల త‌న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేవ‌ర‌కు ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ కానున్నాడు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల పాటు ఫ్యామిలీతో విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం 6 – 8 కిలోల బ‌రువు త‌గ్గ‌నున్నాడ‌ట‌. ఇదో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ సినిమా. ఎన్టీఆర్ గెట‌ప్పే స‌రికొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా జూన్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయి. ఈలోగా ఆచార్య ప్ర‌మోష‌న్లు పూర్తి చేసి కొర‌టాల మిగిలిన కాస్టింగ్ ఎంపిక కంప్లీట్ చేస్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news