Movies'RRR' టికెట్లను చించేసిన అభిమానులు..ఇదేం కొత్త తలనొప్పులు రా బాబు..?

‘RRR’ టికెట్లను చించేసిన అభిమానులు..ఇదేం కొత్త తలనొప్పులు రా బాబు..?

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫిక్షన‌ల్ పీరియాడిక్ చిత్రం RRR. కొద్ది సేపటి క్రితమే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా ఫస్ట్ షోతోనే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రిమియర్ షోలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మెగా ఫ్యామిలీ హీరో.. నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు న‌టించ‌డంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటే.. మరో వైపు వాళ్ళ అభిమానులు మాత్రం ధియెటర్స్ వద్ద గొల గోల చేస్తున్నారు.

ఐతే ఏపిలో RRR సినిమా టికెట్ల విషయంలో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం లేక పోనూ లేదు..సినిమా టికెట్ పై ఓ హీరో అభిమాన సంఘం నాయకుల పేర్లు ఉండటమే దీనికి కారణం. దీంతో అక్కడక్కడా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా స్టార్ట్ అయింది. కొన్ని థియేటర్ల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది. ఫ్యాన్ షో టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నేతల పేర్లు ముద్రించడం తో సీన్ వివాదంగా మారింది.

టికెట్ పై సంఘం నేతల పేర్లు , ఫోన్ నెంబర్లు ముద్రించడం ఏంతని..మరో హీరో వర్గం అభిమానులు థియేటర్ ఎదుటే షో టికెట్లను చించివేశారు. దీంతో పరిస్ధితి అదుపుతప్పింది. కుప్పంలోని RRR సినిమా టికెట్లపై కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండటమే అభిమానుల మధ్య గొడవకు కారణమైనట్లు తెలుస్తోంది. టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నేతల పేర్లు ముద్రించండంతో మరో హిరో అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

థియేటర్ ఎదుటే సినిమా టికెట్లు చించేసి హంగామా సృష్టించారు. దీంతో పరిస్ధితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగ్గారు పోలీసులు. ఇలా చాలా చోట్ల ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినట్టు సమాచారం. అయితే సినిమా మాత్రం ప్రీమియర్ షో పడినప్పటి నుంచీ సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news