Moviesత‌ల్లి షాలిని కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ అమ్మ అని పిలిచే మ‌హిళ...

త‌ల్లి షాలిని కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ అమ్మ అని పిలిచే మ‌హిళ ఎవ‌రో తెలుసా..!

త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్లు మామూలుగా లేవు. ఎక్క‌డ చూసినా ఇప్పుడు ఈ సినిమా ప్ర‌మోష‌న్ల హ‌డావిడే క‌నిపిస్తోంది. ఈ ప్ర‌మోష‌న్లు సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు.. చివ‌ర‌కు దుబాయ్‌లో కూడా జ‌రుగుతున్నాయి. అమెరికాలో అయితే త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. సినిమా రిలీజ్‌కు మ‌రో రెండు రోజుల టైం మాత్ర‌మే ఉంది. ఈ ప్ర‌మోష‌న్ల‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముగ్గురూ పాల్గొంటున్నారు. ప్ర‌మోష‌న్ల‌లో ముగ్గురు పాల్గొంటున్నా కూడా ప్ర‌తి ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లోనూ.. ప్ర‌తి ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్ ఒక్క‌డు మాత్ర‌మే హైలెట్ అవుతున్నాడు.

 

ఎన్టీఆర్ ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌, ఆ స్పీచ్, ఆ స్పాంటేనియ‌స్‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. ఇక ఓవ‌ర్సీస్‌లోనూ.. ఇటు రెండు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ హ‌డావిడే ఎక్కువుగా క‌నిపిస్తోంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంఎం. కీర‌వాణి నిర్వ‌హించిన చిట్ చాట్‌తో పాటు యాంక‌ర్ సుమ నిర్వ‌హించిన చిట్ చాట్‌లోనూ వీళ్లు పాల్గొన్నారు. కీర‌వాణి చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రు మాత్ర‌మే పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలోనే కీర‌వాణి తాను మ్యూజిక్ ఇచ్చిన పాటల్లో ఏ పాట అంటే న‌చ్చ‌ద‌ని ఎన్టీఆర్‌ను అడిగాడు. అందుకు ఎన్టీఆర్ నాగార్జున హిట్ సినిమా ఘ‌రానా బుల్లోడు సినిమాలో భీమ‌వ‌రం బుల్లోడా పాట అంటే త‌నకు న‌చ్చ‌ద‌ని చెప్పి కీర‌వాణికి షాక్ ఇచ్చాడు. ఆ పాట‌లో లిరిక్సా లేదా మధ్య‌లో వ‌చ్చే బీటో కాని ఎందుకో ఆ పాట అంటేనే త‌న‌కు అస‌హ్యం వేస్తుంద‌ని చెప్పాడు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమాలో రెడ్డ‌మ్మ త‌ల్లి పాట పాడిన మోహ‌నా భోగ‌రాజ్ అంటే త‌న‌కు చాలా ఇష్టం అని చెప్పాడు.

ఇక కీర‌వాణి నీ మొబైల్ నెంబ‌ర్‌లో 1 ప‌ర్సంట్ చార్జింగ్ మాత్ర‌మే ఉంది. కీర‌వాణి, రాజ‌మౌళి, దాన‌య్య‌, శ్రీ వ‌ల్లి న‌లుగురిలో ఒక‌రికే కాల్ చేసే ఛాన్స్ ఉంటే ఎవ‌రికి చేస్తావు ? అని తార‌క్‌ను ప్ర‌శ్నించాడు. అప్పుడు తార‌క్ డైరెక్టుగా శ్రీవ‌ల్లి పేరు చెప్పేశాడు. తాను శ్రీ వ‌ల్లి గారికి కాల్ చేస్తాను అని.. శ్రీ వ‌ల్లిని అమ్మ అని పిల‌వ‌డం ఎప్ప‌టి నుంచో ఉంద‌న్నాడు. తాను త‌న అమ్మ త‌ర్వాత శ్రీ వ‌ల్లిని మాత్ర‌మే అమ్మ అని పిలుస్తాను అని ఎన్టీఆర్ చెప్పాడు. శ్రీ వ‌ల్లికి కాల్ చేస్తే అంద‌రికి కాల్ చేసిన‌ట్టే అని ఎన్టీఆర్ అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news