Gossipsఫ్రెండ్‌ పార్టీలో షాకింగ్ బీహేవియర్.. కొత్త డౌట్లు పుట్టిస్తున్న ధనుష్‌-ఐశ్వర్య..?

ఫ్రెండ్‌ పార్టీలో షాకింగ్ బీహేవియర్.. కొత్త డౌట్లు పుట్టిస్తున్న ధనుష్‌-ఐశ్వర్య..?

ఈమధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. రీజన్స్ తెలియవు కానీ బడా బడా స్టార్స్ పిల్లలే ఇలా ఎక్కువుగా విడాకులు అంటూ తొందర పడుతున్నారు. ఇప్పటికే చై-సామ్ విడాకులు తీసుకుంటున్నం అంటూ నెత్తిన పెద్ద బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ బాధ నుండి కోలుకోక ముందే ..స్టార్ డాటర్ ఐశ్వర్య..కోళీవుడ్ హీరో ధనుష్.. ఏకంగా తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేశారు. విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ధనుష్, ఐశ్వర్య షాకింగ్ న్యూస్ చేప్పారు.

దీంతో వీళ్ళ విడాకుల మ్యాటర్ గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా వెలుగొందారు ధనుష్‌- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

18 ఏళ్లు సంతోషంగా గడిపేసిన వీరిద్దరు ఎందుకు విడిపోయారంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ వీరు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. ధనుష్‌-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే వాళ్ళు విడాకులు తీసుకోవడం లేదని పిలల కోసం కలిసే ఉండటానికి నిర్ణయించుకున్నారని మరో వార్త హాట్ టాపిక్ గా ట్రేండ్ అయ్యింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో నిజం లేదు. అవన్ని కేవలం పుకార్లే. ఇటీవల చెన్నై లో ధనుష్, ఐశ్వర్యలు ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారట. సిటీలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో గ్రాండ్‌గా ఈ పార్టీ జరిగిన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పార్టీకి వచ్చిన వారంతా కూడా ధనుష్‌, ఐశ్వర్య బీహేవియర్ చూసి ఆశ్చర్య పోయారట. వీళ్లు ఫ్రెండ్లీ గానే విడిపోయారు అని అనుకున్నవారంతా అక్కడ జరిగినా సీన్స్ చూసి వీళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగిందని ఫిక్స్ అయిపోయారట.

ఫంక్షన్ లో వీళ్ల మాట్లాడుకుంటారమోనని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. కనీసం ఎదురు పడినా కూడా మొహాలు చూసుకోకుండానే తప్పుకుని పోయారట. పార్టీ మొత్తంలో కూడా వారు దూరంగానే ఉన్నారట. కనీసం మాటవరుసకైనా ఒకరినొకరు మాట్లాడుకోలేదట. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పార్టీకి వచ్చిన వారు అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news