Moviesఆ హీరోయిన్‌ను బాల‌య్య అంత సిన్సియ‌ర్‌గా ల‌వ్ చేశాడా... ఎన్టీఆర్‌, హ‌రికృష్ణ...

ఆ హీరోయిన్‌ను బాల‌య్య అంత సిన్సియ‌ర్‌గా ల‌వ్ చేశాడా… ఎన్టీఆర్‌, హ‌రికృష్ణ ఎందుకు వ‌ద్ద‌న్నారు..!

నంద‌మూరి న‌ట‌సింహం సినిమా లైఫ్‌లో ఎంత సీరియ‌స్‌గా ఉంటారో.. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో అంత జోవిల‌య్‌గా ఉంటారు. కుటుంబానికి, త‌న చుట్టూ ఉన్న మ‌నుషుల‌కు బాల‌య్య ఎంతో విలువ ఇస్తారు. ఇక బాల‌య్య భార్య వ‌సుంధ‌ర‌, ఇద్ద‌రు కుమార్తెలు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని, కుమారుడు మోక్ష‌జ్ఞ‌ల‌తో ఆయ‌న‌ది ఓ అంద‌మైన కుటుంబం. అటు ఇద్ద‌రు కుమార్తెల‌కు తిరుగులేని సంబంధాలు వ‌చ్చాయి. ఇక మోక్ష‌జ్ఞ వెండితెరం గ్రేటం కోసం అంద‌రూ ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే బాల‌య్య‌కు ఏ హీరోయిన్‌తోనూ ఎఫైర్లు ఉన్నాయ‌నో.. లేదా సంథింగ్ సంథింగ్ న‌డిచింద‌నో ఈ నాలుగు ద‌శాబ్దాల్లో ఏనాడు ఎలాంటి పుకార్లు రాలేదు. అయితే ఒక్క హీరోయిన్ విష‌యంలో మాత్రం ఈ పుకారు బ‌య‌ట‌కు పొక్కింది. మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు సైతం కొన్ని ఇంట‌ర్వ్యూల్లో బాల‌య్య మ‌ద్రాస్ హీరోయిన్‌ను ప్రేమించాడ‌ని.. అది న‌చ్చ‌ని ఎన్టీఆర్ వెంట‌నే పెళ్లి చేసేయాల‌ని చెప్ప‌డంతోనే తాను కాకినాడ‌లో ఉన్న త‌మ బంధువుల సంబంధం కుదిర్చి.. వ‌సుంధ‌ర‌తో ఆయ‌న పెళ్లి చేశాన‌ని చెప్పారు.

ఇక బాల‌య్య సినిమాల‌కు కాస్ట్యూమ్స్ విభాగంలో ప‌నిచేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీ రాపాక బాల‌య్య గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆమె తాజా ఇంట‌ర్వ్యూల్లో బాల‌య్య‌ను ఆకాశానికి ఎత్తేసింది. బాల‌య్య ఇంట్లో చాలా సింపుల్‌గా ఉండే మ‌నిషి.. ఆయ‌న‌ది కిడ్ మ‌న‌స్త‌త్వం, లోప‌ల ఒక‌టి ఉంచుకుని.. బ‌య‌ట‌కు ఒక‌టి మాట్లాడ‌రు అని చెప్పింది. ఇక బాల‌య్య త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేసుకుంటార‌ని.. అప్ప‌ట్లో ఓ హీరోయిన్‌తో త‌న ల‌వ్ స్టోరీ గురించి చెప్పేశార‌ని శ్రీ రాపాక చెప్పింది.

ఆ హీరోయిన్ పేరు మాత్రం చెప్ప‌ని శ్రీ బాల‌య్య మాత్రం ఆ హీరోయిన్‌ను తాను చాలా సిన్సియ‌ర్‌గా, సీరియ‌స్‌గా ల‌వ్ చేశాడ‌ని చెప్పార‌ని చెప్పింది. షూటింగ్ స్పాట్లో కాస్ట్యూమ్స్ వ‌ర్క్ జ‌రిగేట‌ప్పుడు బోర్‌గా ఉంటుంద‌ని బాల‌య్య ఏదో ఒక ఇంట్ర‌స్టింగ్ విష‌యం చెపుతూనే ఉంటార‌ని కూడా చెప్పింది. తాను ఆ అమ్మాయిని సిన్సియ‌ర్‌గా ప్రేమించ‌డంతో పాటు పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని.. అయితే ఆ పెళ్లి త‌న అన్న హ‌రికృష్ణతో పాటు నాన్న ఎన్టీఆర్‌కు ఇష్టం లేక‌పోయింద‌ని చెప్పిన‌ట్టు చెప్పింది.

స‌రే శ్రీ రాపాక ఆ హీరోయిన్ పేరు చెప్ప‌లేదు. అటు నాదెండ్ల భాస్క‌ర‌రావు త‌న ఇంట‌ర్వ్యూలోనూ చెప్ప‌లేదు. అయితే నాదెండ్ల మాత్రం మ‌ద్రాస్ అమ్మాయి అన్నారు. ఇక అప్ప‌ట్లో వినిపించిన వార్త‌ల ప్ర‌కారం బాల‌య్య – ఖుష్బూ ప్రేమించుకున్నార‌ని ఓ టాక్ అయితే ఉంది. అయితే సినిమా వాళ్లు త‌మ ఇంటికి కోడ‌లిగా వ‌స్తే బాల‌య్య‌ను స‌రిగా చూడ‌రేమోన‌న్న భ‌యం ఎన్టీఆర్‌కు ఉండేది. అందుకే ఆయ‌న సంప్ర‌దాయ కుటుంబానికి చెందిన వ‌సుంధ‌ర‌నే త‌మ ఇంటి కోడ‌లిని చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news