Moviesబాల‌య్య #107 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది... మ‌ళ్లీ పూన‌కాలే...!

బాల‌య్య #107 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది… మ‌ళ్లీ పూన‌కాలే…!

అఖండ‌తో అఖండ గ‌ర్జ‌న మోగించిన న‌ట‌సింహం బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్షన్‌లో 107వ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ బాల‌య్య‌ను ఢీ కొట్టే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ ముస‌ళ్ల మ‌డుగు ప్రతాప్ రెడ్డి పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ భ‌యంక‌రంగా ఉండ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాను కంటిన్యూగా షూటింగ్ ఫినిష్ చేసి వ‌చ్చే ద‌స‌రాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ద‌స‌రాకే బాల‌య్య సినిమా అంటే అఖండ వ‌చ్చిన యేడాదిలోపే మ‌రో సినిమాతో ఆయ‌న అభిమానుల‌కు మాంచి విందు ఇవ్వ‌నున్నాడ‌న్న మాట‌. ఇది కూడా బాల‌య్య స్టైల్లో ఫుల్ మాస్ జాత‌ర కావడంతో మ‌రోసారి థియేట‌ర్లు మాస్ మానియాతో ఊగిపోనున్నాయి. ఇక థ‌మ‌న్ స్వ‌రాలు అందించే ఈ సినిమాపై మ్యూజిక్‌గా కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఈ సినిమా త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి – బాల‌య్య కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను జూన్ ఫ‌స్ట్ వీక్‌లో స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సినిమా కోస‌మే అనిల్ రావిపూడి వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాలో మ‌రో హీరో పాత్ర ఉంటుంద‌ని.. అది ర‌వితేజ పాత్రే అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌స్టాఫ్ అంతా చాలా సీరియ‌స్‌గా సాగుతుంద‌ని.. సెకండాఫ్‌లో ర‌వితేజ పాత్ర ఉంటుంద‌ని.. సెకండాఫ్‌లో కామెడీతో పాటు యాక్ష‌న్‌కు స్కోప్ ఉంటుంద‌ని అంటున్నారు. బాల‌య్య – అనిల్ కాంబినేష‌న్లో గ‌తంలోనే రామారావు గారు టైటిల్‌తో ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ క‌థ బాల‌య్య‌కు అంత‌గా ఎక్క‌లేదు. ఆ త‌ర్వాత మ‌రో క‌థ‌ను అనిల్ వినిపించ‌గా బాల‌య్య ఓకే చెప్పాడు. ఆ క‌థ‌తోనే ఇప్పుడు ఈ సినిమా ప‌ట్టాలు ఎక్కుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news