Moviesఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో హాట్ టాపిక్‌గా అజిత్ రెమ్యున‌రేష‌న్‌..!

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో హాట్ టాపిక్‌గా అజిత్ రెమ్యున‌రేష‌న్‌..!

సౌత్ ఇండియాలో ఈ త‌రం జన‌రేష‌న్ హీరోల‌లో అజిత్ ఒక‌డు. త‌మిళ‌నాడు అజిత్ సినిమా వ‌స్తోంది అంటే బాక్సాఫీస్ రెండు, మూడు రోజుల ముందు నుంచే హీటెక్కిపోయి ఉంటుంది. తాజాగా వ‌చ్చిన అజిత్ వ‌లీమై సినిమా మిక్స్‌డ్ టాక్‌తో కూడా ఏకంగా రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింద‌ని ఈ సినిమా నిర్మాత బోనీక‌పూర్ తాజాగా ప్ర‌క‌టించారు. కార్తీతో ఖాకీ లాంటి స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కించిన సీహెచ్‌. వినోద్ ఈ వ‌లీమై అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందించాడు.

ఇక అజిత్ స్టైలీష్ సినిమాల‌కు కోలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా ఇటు టాలీవుడ్‌, అటు క‌న్న‌డంలోనూ మాంచి క్రేజ్ ఉంటుంది. అస‌లు అజిత్ సినిమా ఎంట్రీయే తెలుగుతోనే స్టార్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత అజిత్ కోలీవుడ్ వైపు కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో అక్క‌డ స్టార్ హీరో అయ్యాడు. కోలీవుడ్‌లో అజిత్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక వ‌లీమై సినిమా త‌ర్వాత అజిత్ చేయ‌బోయే సినిమా రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను న‌య‌న‌తార ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు అజిత్ తీసుకుంటోన్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఏకంగా రు. 102 కోట్ల రెమ్యున‌రేష‌న్ అజిత్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు అజిత్‌కు రు. 60 – 70 రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకు రు. 102 కోట్ల రెమ్యున‌రేష‌న్ అన్న వార్త‌ల‌తో కోలీవుడ్ ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాదు.. ఇండియ‌న్ సినిమా అంతా షేక్ అవుతుంది. ఈ సినిమా నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ వారు అజిత్ కి అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యార. మ‌రి హీరో రెమ్యున‌రేష‌నే ఈ రేంజ్‌లో ఉంటే ఇక మిగిలిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల రెమ్యున‌రేష‌న్ ఎంత ఉంటుంది.. అస‌లు ఈ సినిమా బ‌డ్జెట్ ఎంత అన్న‌ది కూడా ఇప్పుడు సంచ‌న‌లంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news