MoviesRRRకు బాలీవుడ్‌లో ఎదురు దెబ్బ‌.. క‌లెక్ష‌న్ల‌పై ఎఫెక్ట్...!

RRRకు బాలీవుడ్‌లో ఎదురు దెబ్బ‌.. క‌లెక్ష‌న్ల‌పై ఎఫెక్ట్…!

RRR భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మూడేళ్లుగా ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న సినిమా. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మూడున్న‌రేళ్లుగా షూటింగ్ కోస‌మే చెక్కిన ఈ అద్భుత క‌ళాఖండ శిల్పం కోసం మ‌రో రెండేళ్లు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేశారంటే న‌మ్మాల్సిందే. అంటే ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం రాజ‌మౌళి & టీం వ‌ర్క్ చేసింది. రు. 500 కోట్ల బ‌డ్జెట్ సినిమాకు కేటాయించారు అంటేనే ఈ సినిమాపై రాజ‌మౌళి ఎంత కాన్ఫిడెంట్‌తో ఉన్నాడో అర్థ‌మ‌వుతోంది.

ఈ నెల 25న భార‌త‌దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో త్రిబుల్ ఆర్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఏకంగా 14 భాష‌ల్లో ఈ సినిమాను డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మ‌న‌దేశంలో తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డం, మ‌ళ‌యాళం, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు బాలీవుడ్‌ను ఊపేస్తోన్న క‌శ్మీర్ ఫైల్స్‌ను పెద్ద దెబ్బే ప‌డ‌నుంద‌న్న చ‌ర్చ‌లు బీ టౌన్ ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమాకు పోటీగా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే రు. 140 కోట్ల వ‌సూళ్లు దాటేసింది. ఈ వీకెండ్‌కే ఈ సినిమా రు. 200 కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంద‌ని.. లాంగ్ ర‌న్లో ఇవి మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో న‌గ‌రాలు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇప్పుడు ఈ సినిమాయే టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

క‌శ్మీర్ ఫైల్స్ సినిమా దెబ్బ‌తో ప్ర‌భాస్ రాధేశ్యామ్ అడ్ర‌స్ లేకుండా పోయింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఎన్ని భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్నా కూడా క‌శ్మీర్ ఫైల్స్‌కు ఇప్ప‌టికే హిట్ టాక్ ఉండ‌డంతో పాటు నార్త్‌లో రోజు రోజుకు థియేట‌ర్ల సంఖ్య పెరుగుతూ ఉండ‌డం.. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప‌న్ను మిన‌హాయించ‌డం.. అటు ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి మోడీతో పాటు బీజేపీ పాలిత ముఖ్య‌మంత్రులు సైతం మెచ్చుకోవ‌డంతో చాలా ప్రీ ప‌బ్లిసిటీ ఈ సినిమాకు జ‌రుగుతోంది.

నార్త్‌లో క‌శ్మీర్ ఫైల్స్ కంటిన్యూ అవుతున్న థియేట‌ర్ల‌ను ఖాళీ చేసే ప్ర‌శ‌క్తే లేదు. అది కాక మ‌రికొన్ని థియేట‌ర్లు అద‌నంగా యాడ్ చేస్తున్నారు. ప్రీ ప‌బ్లిసిటీతో పాటు ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన‌మంత్రులే మెచ్చుకోవ‌డంతో ఈ సినిమా నుంచి నార్త్‌లో మాత్ర‌మే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా ఉన్న మెట్రో న‌గ‌రాల్లో సైతం గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. మ‌రి ఈ పోటీని త‌ట్టుకుని త్రిబుల్ ఎలా పెర్పామ్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news