Moviesమొగుడు ఉండ‌గానే ఇత‌రుల‌తో... స్టార్స్ కూతుళ్ల‌పై శ్రీరెడ్డి బూతులు (వీడియో)

మొగుడు ఉండ‌గానే ఇత‌రుల‌తో… స్టార్స్ కూతుళ్ల‌పై శ్రీరెడ్డి బూతులు (వీడియో)

టాలీవుడ్‌లో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయిపోయింది కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీరెడ్డి. నోరు తెరిస్తే చాలు ప‌చ్చి బూతుల‌తో విరుచుకు ప‌డే శ్రీరెడ్డి… అవ‌త‌ల వారు ఎలాంటి వ్య‌క్తి అయినా కూడా ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా ప‌చ్చి బూతులు వాడుతూ విమ‌ర్శిస్తోంది. గ‌త నాలుగేళ్లుగా శ్రీ రెడ్డి ఇలాగే పాపుల‌ర్ అయ్యింది. తాజాగా శ్రీ రెడ్డి ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్స్ కిడ్స్ గురించి బాంబు పేల్చింది. వారి పెళ్లిళ్లు.. విడాకుల‌పై ఆమె ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఇప్పుడు ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.

సినిమా వాళ్ల‌లో కొంద‌రు స్టార్స్ కిడ్స్ పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకుని విడిపోతున్నారు.. ఇలా విడాకులు తీసుకుని విడిపోవ‌డానికి కార‌ణాలు ఏంటో కూడా ఆమె చెప్పారు. తాను అభి ద‌గ్గుబాటితో క‌లిసి ఓ ప‌బ్‌కు వెళ్లిన‌ప్పుడు ఆ స్టార్ హీరో కూతురు ఫుల్లుగా తాగేసి ప‌బ్‌లో చిందులు వేస్తోందని… ఆ మ‌త్తులోనే ఆమె అభి వ‌ద్ద‌కు వ‌చ్చి కూడా ముద్దులు పెట్టుకుంద‌ని శ్రీ రెడ్డి చెప్పింది.

స్టార్ కిడ్స్ పెళ్ల‌య్యాక చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తే స‌ర్దుకుపోవాల‌ని.. అయితే పెళ్ల‌య్యాక కూడా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, పబ్‌లు, క్ల‌బ్‌లు.. అని తిర‌గ‌డం వ‌ల్లే గ్యాప్ వ‌చ్చి విడాకులు తీసుకుంటున్నార‌ని శ్రీ రెడ్డి చెప్పింది. ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కూడా విడాకులు తీసుకుంటే.. ఆ బిడ్డ‌కు ఎలాంటి మెసేజ్ ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని కూడా శ్రీరెడ్డి ఆ స్టార్ కిడ్స్‌ను ప్ర‌శ్నించింది. ఆ పిల్ల‌ల భ‌విష్య‌త్తును కూడా వారు ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేస్తున్నార‌ని శ్రీరెడ్డి తెలిపింది.

ఇక శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్లు ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడాకుల త‌ర్వాత తెలుగులో కూడా ఓ స్టార్ హీరో కూతురు త‌న రెండో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేస్తోంద‌న్న వార్త‌లు బాగా వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో కిడ్‌ను ఉద్దేశించే ప‌బ్‌లు, క్ల‌బ్‌లు అని ప‌రోక్షంగా కామెంట్ చేసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news