Moviesఏం ఏంజాయ్ చేస్తున్నాడు రా బాబు...నెట్టింట వైరల్ గా మారిన హీరో...

ఏం ఏంజాయ్ చేస్తున్నాడు రా బాబు…నెట్టింట వైరల్ గా మారిన హీరో టూ హాట్ లిప్ లాక్ (వీడియో)..!!

నవదీప్..మనకు బాగా తెలిసిన వ్యక్తే. మొదట హీరో గా ఆకటుకున్న ఈయన…ఇప్పుడు సహనటుడిగా సినిమాలు చేస్తూ కాలం గదిపేస్తున్నారు. తేజ దర్శకత్వం లో వచ్చిన “జై” సినిమాతో పరిచయమైనా నవదీప్ ఇప్పుడు సహనటుడిగా స్థిర పడిపోయాడు టాలీవుడ్ లో . బిగ్ బాస్ షో తో ఫేమస్ అయ్యి మెయిన్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ పిల్లి కళ్ళ హీరో. హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్న నవదీప్ సైడ్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి నటుడుగా బాగా గుర్తింపు పొందాడు.

అయితే కొంతకాలంగా వెండితెర కు దూరం గా ఉన్న నటుడు నవదీప్..మళ్ళీ సినిమాలో కనిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘లవ్ మౌళి’ అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. జనవరి 26న అతని పుట్టిన రోజు సందర్భంగా ‘లవ్ మౌళి’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆకట్టుకోగా..

ఈరోజు ప్రేమికుల రోజు సందర్భాంగా హీరోయిన్ తాలూకా వీడియో రిలీజ్ చేసి సినిమా పై ఇంట్రెస్ట్ ను పెంచుతున్నారు మేకర్స్. నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ మౌళి’. ఆయన సరసన ఫంకూరీ గిద్వానీ నటిస్తోంది.

నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ అఫ్ మౌళి అంటూ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఈ సినిమాలోని హీరోయిన్ లుక్ ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది. ఇక ఈ వీడియోలో నవదీప్‌తో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో అందంగా కనిపించింది పంఖురి.

కర్లీ హెయిర్ తో కురచ దుస్తుల్లో ఉన్న గిద్వానీ అద్భుతమైన లుక్ యువ హృదయాలను ఆకట్టుకుంటోంది. ఈ చిన్న వీడియో హీరోహీరోయిన్ల మధ్య ఇంటెన్స్ లవ్ ని కూడా ప్రెజెంట్ చేస్తోంది.

ఇక చివర్లో మౌళి , చిత్రకు లిప్ లాక్ ఇస్తూ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీని పై నెటిజన్స్ సినిమాల పేరుతో లిప్ కిస్ చేస్తూ ఏం ఎంజాయ్ చేస్తున్నారు గురు వీళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కనీసం ఈ సినిమాతోనైనా నవదీప్ కెరీర్ సెట్ అవుతుందేమో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news