Moviesథియేట‌ర్ల‌లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

థియేట‌ర్ల‌లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

ఇప్పుడు ఓ సినిమా థియేట‌ర్లో వారం రోజులు ఆడ‌డ‌మే గ‌గ‌నం అయిపోతోంది. రెండో వారం వ‌చ్చిందంటే చాలు పోస్ట‌ర్ మారిపోతుంది. అయితే ప‌ది ప‌దిహేనేళ్ల క్రితం వ‌ర‌కు సినిమా హిట్ అయ్యింది అనేందుకు 50 రోజులు, 100 రోజులే కొల‌మానాలు.. ఇప్పుడు కేవ‌లం క‌లెక్ష‌న్లే కొల‌మానాలు అవుతున్నాయి. ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ అయ్యి మూడు, నాలుగు వారాలు అయితే చాలు ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఎక్కువ రోజులు థియేట‌ర్ల‌లో ఆడి రికార్డుల‌కు ఎక్కిన తెలుగు సినిమాలు ఏవో చూద్దాం.

– లవకుశ:
1963లో ఎన్టీఆర్ హీరోగా సి. పుల్లారావు – సీఎస్‌. రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా తొలి తెలుగు క‌ల‌ర్ సినిమా. 469 రోజులు థియేట‌ర్లో ఆడిన ఈ సినిమా ఆ రోజుల్లోనే కోటి రూపాయ‌లు వ‌సూలు చేయ‌డంతో పాటు 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
– అడవి రాముడు:
1977లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి తారకరామారావు హీరోగా.. జయసుధ – జయప్రద హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఇది. అప్పట్లో ఏడాదికి పైగా థియేటర్లలో ఆడిన ఈ సినిమా ఎన్టీఆర్ సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించింది. 365 రోజులకు గాను దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టింది.

– మరపురాని చిత్రం:
కమల్ హాసన్ – జయప్రద – రజినీకాంత్ కాంబోలో బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా 1978లో థియేటర్లలోకి వచ్చి 556 రోజులు ఆడింది.
– వేటగాడు:
ఎన్టీఆర్ – శ్రీదేవి జంటగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెర‌కెక్కిన భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌. 1979లో తెర‌కెక్కిన ఈ సినిమా 409 రోజులు థియేట‌ర్ల‌లో ఆడింది.
– ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి – జయసుధ హీరోయిన్లుగా తెర‌కెక్కిన విషాదాంత ప్రేమ‌క‌థ ఇది. 1981 లో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో 533 రోజులు ఆడింది.

– ప్రేమసాగరం:
1983లో తెలుగులో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ఇది. తమిళ హీరో శింబు తండ్రి టి.రాజేందర్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా సినిమా థియేటర్లలో 465 రోజులు ఆడింది.
– మంగమ్మగారి మనవడు:
నందమూరి బాలకృష్ణ – సుహాసిని జంట‌గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1984లో విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఏకంగా 567 రోజులు ఆడింది.
– పోకిరి:
సూపర్ స్టార్ మహేష్ బాబు – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కి 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో 580 రోజులు ఆడింది.

– మగధీర:
రాజమౌళి – రామ్ చరణ్ కాంబోలో వ‌చ్చి 2009లో విడుదలైన ఈ సినిమా రు. 75 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమా ఒక థియేటర్లో 1000 రోజులకు పైగా ఆడింది.
– లెజెండ్:
సింహా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత‌ నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. 2014లో వ‌చ్చిన ఈ సినిమా ఒక థియేట‌ర్లో 2017 వరకు ఆడింది. రాయలసీమ పొద్దుటూరులోని అర్చన థియేటర్లో 1005 రోజులు ప్రదర్శించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news