Moviesఅన్నం తింటుంటే ప్లేట్ లాకుని.. పో అంటూ అవమానించాడు..హేమ మాటలు వింటే...

అన్నం తింటుంటే ప్లేట్ లాకుని.. పో అంటూ అవమానించాడు..హేమ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం.. ఊహించలేం. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని వచ్చిన అవకాశాలని చేసుకుని ..వెండి తెర పై తమ బొమ్మను చూసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ కలను కొందరే నెరవేర్చుకోగలరు. అలా తన కలను నెరవేర్చుకున్న నటీమణుల్లో హేమ కూడా ఒకరు.

టాలీవుడ్ లో నటి హేమ అంటే తెలియని వారంటూ ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె తనదైన నటనతో కొట్లాది మంది ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ఏ పాత్రనైన అవలీలగా చేసేస్తుంది. తెర పై ఈమె కామెడీ టైమింగ్ లు అభిమానులు పొట్ట నొప్పి వచ్చేలా నవ్వాల్సిందే. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఒదిగిపోయి నటిస్తుంది. ఆల్ మోస్ట్ ఆల్ అందరి హీరో సినిమాలో ఏదో ఒక్క క్యారెక్టర్ చేసి మనల్ని మెప్పించింది హేమ.

ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్ళి సందడి చేసిన ఈమె..ఈ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో శివ బాలజీ చెయ్యి కొరికి సంచలనంగా మారింది. ఇక ఈ మధ్య కాలంలో హేమ నిత్యం ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

ముత్యాల సుబ్బయ్య గారి భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో తనకు జరిగిన ఘోర అవమానం గురించి చెప్ప్తూ..” షాట్ కంప్లీట్ అయ్యాక భీజనం టైం అవ్వడంతో ఆకలి వేసి తినడానికి కూర్చున్నాను. ప్లేట్ లో అన్నం పెట్టుకుని వచ్చి టేబుల్ మీద కూర్చుని అన్నం తింటుండగా.. వెంటనే ఓ ప్రొడక్షన్ బాయ్ వచ్చి..ఇక్కడ కాదు..పోయి అటు పక్కన కూర్చో అంటూ అవమానించాడు. నాకు మొదలే కోపం ఎక్కువ..ఇక అలా అన్నం దగ్గర మాట్లాడేసరికి కోపం వచ్చి.. వెంటనే టేబుల్ ఎత్తి పడేసి కుర్చీ తీసి అతనిపై విసిరెయ్య బోయా. ఇంతలో పక్క వాళ్ళు వచ్చి ఆపారు”..అంటూ చెప్పుకొచ్చింది హేమ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news