Moviesఅమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాలంటే సురేఖ‌వాణి కూతురు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాలంటే సురేఖ‌వాణి కూతురు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖ‌వాణి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె న‌టిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా 20 ఏళ్లుగా తెలుసు. ముందు వ్యాఖ్యాత‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో సినిమాల్లో న‌టించింది. సురేఖ‌వాణికి సినిమాల్లో స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్న వారికి ఎలాంటి అభిమాన‌గ‌ణం ఉంటుందో అదే రేంజ్లో అభిమాన గ‌ణం ఉందంటే న‌మ్మాల్సిందే. ఇక ఆమెతో పాటు ఆమె కుమార్తె పోస్టు చేసే వీడియోలు సోష‌ల్ మీడియాలో ఎంత‌లా దుమ్ము రేపుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక సురేఖ‌వాణికి సినిమాలు, కేరెక్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా స్పెష‌ల్ ఇమేజ్ ఉంది. 18 ఏళ్ల వ‌య‌స్సులోనే సురేష్ తేజ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. సురేఖ కేవ‌లం 20 ఏళ్ల‌కే త‌ల్లి అయ్యింది. ఈ దంప‌తుల‌కు సుప్రీత అనే అమ్మాయి కూడా జ‌న్మించాక సురేఖ‌కు మ‌రింత క‌లిసి వ‌చ్చింది. ఆమెకు సినిమాల్లో వ‌రుస‌గా ఛాన్సులు వ‌చ్చి.. ఫుల్ బిజీ అయ్యింది. అయితే 2019లో ఆమె భ‌ర్త సురేష్‌తేజ అనారోగ్యంతో మృతిచెంద‌డంతో ఆమె కెరీర్ ఒక్క‌సారిగా తల్ల‌కిందులు అయిపోయింది.

ఈ ఘ‌ట‌న‌తో కొద్ది రోజులు షాక్‌లోకి వెళ్లిన సురేఖ‌వాణి త‌న కుమార్తు సుప్రీత‌ను గారాబంగా చూసుకుంటూ ఆమెను కూడా ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసేందుకు ఆతృత‌తో ఉంది. ఇక ఈ త‌ల్లికూతుళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ హాట్ ఫొటోల నుంచి వ‌ర్కవుట్లు ఇలా ప్ర‌తీది సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటూ లైమ్‌టైమ్‌లో ఉంటున్నారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సుప్రీత త‌న త‌ల్లి రెండో పెళ్లి గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రెండో పెళ్లి అనేది పూర్తిగా త‌న త‌ల్లి తీసుకునే నిర్ణ‌యం మీదే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని.. త‌న‌కు అయితే ఖ‌చ్చితంగా ఈ వ‌య‌స్సులో తోడుకోసం అమ్మ‌కు రెండో పెళ్లి చేయాల‌నే ఉంద‌ని చెప్పింది. నాన్న చ‌నిపోయి ఇప్ప‌టికే మూడేళ్లు అవుతోంది… ఇప్పుడిప్పుడే తాము సెటిల్ అవుతున్నాం.. అమ్మ త‌న‌కంటే కూడా నా కెరీర్ మీదే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేస్తోంద‌ని సుప్రీత చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news