Moviesస‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్ - కీర్తి ప్రేమ ఇంత...

స‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్ – కీర్తి ప్రేమ ఇంత మ‌ధుర‌మా…(వీడియో)

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇప్పుడు పుల్ జోష్‌లో ఉన్నాడు. వ‌రుస హిట్ల‌తో ఉన్న మ‌హేష్ రెండేళ్ల క్రితం సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో ర‌ష్మిక – మ‌హేష్ న‌ట‌న, వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన స‌న్నివేశాలు యూత్‌ను గిలిగింత‌లు పెట్టేశాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

యేడాది క్రిత‌మే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌. అస‌లు కీర్తి సురేష్ – మ‌హేష్‌బాబు కాంబినేష‌న్ అన‌గానే ఖ‌చ్చితంగా క్యూట్ కాంబినేష‌న్ అవుతుంద‌నే అనుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన క‌ళావ‌తి ప్రోమో చూస్తుంటూనే ఈ కాంబినేష‌న్‌ను తెర‌మీద చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వ‌న్న‌ట్టుగా ఉంటుంద‌న్న‌ది అర్థ‌మైంది.

మ‌హేష్‌ను ప్రోమోలో చూస్తుంటే మ‌నం 20 ఏళ్ల వెన‌క్కు వెళ్లి నాటి మ‌హేష్‌ను గుర్తు చేసుకోవాల్సిందే అన్నంత అందంగా ఉన్నాడు. అటు కీర్తి – మ‌హేష్ జంట చాలా అద్భుతంగా ఉంటుంద‌న్న‌ది అర్థ‌మైంది. ఇక సినిమాలో ఫ‌స్టాఫ్‌లో మ‌హేష్ – కీర్తి మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు మ‌ధురంగా ఉండ‌డంతో పాటు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం చాలా బాగా డిజైన్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ అయితే వ‌చ్చేసింది. సినిమా అయితే ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news