Moviesబాబోయ్ దీపిక‌తో ప‌దుకునేతో రొమాన్సా... టెన్ష‌న్‌లో కుర్ర హీరో..!

బాబోయ్ దీపిక‌తో ప‌దుకునేతో రొమాన్సా… టెన్ష‌న్‌లో కుర్ర హీరో..!

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సినిమా గెహ్ర‌యాన్‌. అమెజాన్ ద్వారా డైరెక్టుగా ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సిద్ధాంత్ చ‌తుర్వేది హీరోగా దీపిక ప‌దుకునే, అన‌న్య పాండే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌స్తుతం స‌మాజంలో ఉన్న చిత్ర‌, విచిత్ర‌మైన సంబంధాలు గురించి చూపించిన‌ట్టు సినిమా యూనిట్ చెపుతున్నారు. అందుకే రొమాన్స్ సీన్లు కాస్త గ‌ట్టిగానే పెట్టార‌ట‌.ఈ సినిమాలో ఓ పాట ఇప్పుడు యూ ట్యూబ్‌లో బాగా ట్రెండీ అవుతోంది.

ఆ పాటలో సిద్ధాంత్ చ‌తుర్వేది – దీపిక ప‌దుకునే మ‌ధ్య రొమాంటిక్ సీన్లు పీక్స్ స్టేజ్‌లో ఉన్నాయ‌నే అంటున్నారు. ఒక్క పాట‌లోనే ఈ రేంజ్‌లో రొమాన్స్ ఉంటే.. సినిమా అంతా ఇంకెంత రొమాన్స్ ఉంటుందో అని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న వాళ్లు నోరెళ్ల‌బెడుతున్నారు. గెహ్రయాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సిద్దాంత్ చతుర్వేది హీరోయిన్ దీపిక‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న కెరీర్ స్టార్ట్ అయ్యాక ఓ పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైం అని.. షారుఖ్ – ర‌ణ్వీర్‌సింగ్ – ర‌ణ‌బీర్ లాంటి స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేసిన దీపికా ప‌దుకొనేతో తాను ఎలా రొమాన్స్ చేస్తానా ? అన్న టెన్ష‌న్ నాలో ఉండేద‌ని.. బాబోయ్ తాను ఆమెతో న‌టించ‌గ‌ల‌నా ? అన్న అనుమానం కూడా ఉండేద‌ని.. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యాక మెల్ల‌గా అల‌వాటు అయ్యింద‌ని చెప్పింది.

ద‌ర్శ‌కుడు శ‌కున్ ఈ సినిమా క‌థ చెప్పేట‌ప్పుడే సినిమాలో రొమాంటిక్ సీన్లు గ‌ట్టిగా ఉంటాయ‌ని చెప్పాడు.. అయితే అవి ఇంత ఘాటుగా ఉంటాయ‌న్న‌ది మాత్రం చెప్ప‌లేద‌న్నాడు. ఈ రొమాంటిక్ సీన్ల కోసం వ‌ర్క్ షాప్‌లు, ప్రాక్టీస్‌లు చాలానే చేశాన‌ని.. ఈ స్టార్ హీరోయిన్‌తో కుర్ర హీరో రొమాంటిక్ సీన్లు సినిమాకే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news