Moviesరెడ్డి ' ' సింహం ' సెంటిమెంట్ల‌తో బాల‌య్య కొత్త సినిమా...

రెడ్డి ‘ ‘ సింహం ‘ సెంటిమెంట్ల‌తో బాల‌య్య కొత్త సినిమా టైటిల్‌…!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా షూటింగ్ తెలంగాణ‌లోని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్టార్ట్ అయ్యింది. సినిమా ఫ‌స్ట్ సీనే రామ్ – ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో యాక్ష‌న్ పార్ట్‌తో స్టార్ట్ చేశారు. బాల‌య్య ర‌ఫ్‌గా మాసీ లుక్‌తో ఉన్న స్టిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అఖండ‌ను మించిపోయిన లుక్‌లో బాల‌య్య ద‌ర్శ‌నం ఇస్తున్నారు. మైత్రీ మూవీస్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసి ఈ యేడాది ద‌స‌రాకే థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు అయితే జ‌రుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు కూడా బాల‌య్య‌కు క‌లిసొచ్చిన రెడ్డి టైటిల్ పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయంటున్నారు. క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా తెర‌కెక్కిన మ‌ఫ్టీ సినిమాలోని థ్రెడ్ తీసుకుని.. దానికి గోపీచంద్ మార్క్ యాక్ష‌న్ ట్రీట్‌మెంట్ జోడించి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని అంటున్నారు.

అయితే ఇది రీమేకా ? కాదా ? అన్న‌ది మాత్రం ఎవ్వ‌రూ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక బాల‌య్య కెరీర్‌లో స‌మ‌ర‌సింహారెడ్డి ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌రో తెలిసిందే. ఆ త‌ర్వాత వ‌చ్చిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి కూడా హిట్టే. అలా త‌న‌కు బాగా క‌లిసొచ్చిన రెడ్డి సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ సినిమాకు వీర‌సింహారెడ్డి టైటిల్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. రెడ్డి టైటిల్‌కు, బాల‌య్య‌కు ఉన్న సెంటిమెంట్ చెప్ప‌క్క‌ర్లేదు. కథ‌లో కాస్త ద‌మ్ము ఉండాలే కాని సినిమాను బాల‌య్య త‌న న‌ట‌న‌తో సింగిల్ హ్యాండ్‌తో హిట్ చేసేస్తాడు. ఇందుకు అఖండే పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

బాల‌య్య‌కు బాగా క‌లిసొచ్చిన రెడ్డి, సింహా టైటిల్స్‌ను మిక్స్ చేసి వీర‌సింహారెడ్డిగా పెడుతున్నార‌ట‌. అఖండ జోష్‌లో బాల‌య్య‌, అటు క్రాక్ హిట్‌తో మ‌లినేని గోపీచంద్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. మ‌రి ఈ సినిమా క్లిక్ అయితే అఖండ‌ను మించిన బొమ్మ అవ్వుద్ది అన‌డంలో డౌట్ అక్క‌ర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news