Moviesఆ విషయంలో ప్రభాస్ తప్పుచేస్తున్నాడు..కొంచెం అర్ధమైయ్యేలా చెప్పండయ్యా..?

ఆ విషయంలో ప్రభాస్ తప్పుచేస్తున్నాడు..కొంచెం అర్ధమైయ్యేలా చెప్పండయ్యా..?

టాలీవుడ్ హీరో ప్రభాస్..ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. బహుభలి సినిమా తరువాత ప్రభస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయనే టాప్ హీరో . దర్శకులు,నిర్మాతలు ఆయనతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయనతో సినిమా తీస్తే..మూవీ ఫ్లాప్ అయినా..కలెక్షన్స్ పరంగా నష్టపోము అనే నమ్మకం. సాహో విషయంలోను అదే జరిగింది.

ఇప్పుడు ప్రభాస్ మరో మ్యాజిక్ చేయడానికి..రాధే శ్యామ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా తో ప్రభాస్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడు అంటున్నారు అభిమానులు. అయితే ప్రభాస్ మాత్రం ఓ విషయంలో తప్పు చేస్తున్నాడు అంటున్నారు కొందరు అభిమానులు. ఇప్పటికే ఐదు సినిమాలు చేతులో పట్టుకుని ఉన్న ఈయన రీసెంట్ గా మరొ సినిమాకి సైన్ చేశాడట. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్‌ ప్రభాస్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నత్లు తెలుస్తుంది. ఓ ఇంటెన్స్‌ యాక్షన్‌ సబ్జెక్ట్‌తో డార్లింగ్‌ను మెప్పించారట ఆనంద్‌. ఈ లైన్ ప్రభాస్‌కు ఏ రేంజ్‌లో నచ్చిందంటే.. ఆల్రెడీ ఓకే చెప్పిన సినిమాలను కూడా వెనక్కి నెట్టి.. సిద్దార్థ్ సినిమాను ముందే సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.

అయితే దీని పై ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నా..ప్రభాస్ తన పెళ్లి గురించిన వార్త చెప్పడం లేదని బాధపడుతున్నారు. ఎంత సేపు సినిమాలేనా..కొంచెం పెళ్లి గురించి కూడా ఆలోచించవయ్యా అంటూ సినీ పెద్దలు కూడా ప్రభాస్ ను ఫోర్స్ చేస్తున్నారట. కానీ ప్రభాస్ మాత్రం తన పెళ్లి పై ఇంట్రెస్ట్ చూయించట్లేదు. ఆయన పెళ్లి చేసుకుంటే చూడాలని..కోట్లాది మంది అభిమానులతో పాటు బడా స్టార్ కూడావెయిట్ చేస్తున్నారు. మరి ప్రబాస్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడొ చెప్తారో వేచి చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news